విడుదలకు ముందే బ్రహ్మాస్త్ర సంచలన రికార్డ్..!!

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఆశలు మొత్తం ఇప్పుడు బ్రహ్మాస్త్ర సినిమా మీదే ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అగ్ర హీరోల సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇటీవల వచ్చిన అమీర్ ఖాన్- అక్షయ్ కుమార్- సల్మాన్ ఖాన్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా పడ్డాయి. అయితే ఇప్పుడు భారీ అంచనాలతో సెప్టెంబర్ 9న బ్రహ్మాస్త్ర ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న హైదరాబాద్ పార్క్ హయత్ లో నిర్వహించారు. సౌత్ లో ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి సమర్పకుడిగా ఉన్నాడు.

Ranbir Kapoor New Movie Brahmastra Trailer

ఇది ఇలా ఉండగా ఈ సినిమా భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 8000కి పైగా స్క్రీన్ స్లో రిలీజ్ చేస్తుండటం విశేషం. 5000 స్క్రీన్స్ ఇండియాలోనే ఉన్నాయి. మిగిలిన 3000 స్క్రీన్స్ ఓవర్సీస్ లో రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. దీంతో బాహుబలి- కేజిఎఫ్- త్రిబుల్ ఆర్ సినిమాలు తర్వాత భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న సినిమాలో ఈ సినిమా కూడా ఒకటి గా నిలిచింది.

 

Share post:

Latest