ప్రభాస్ అలాంటి వాడు.. రెబల్ స్టార్ పై బాలీవుడ్ బ్యూటీ కామెంట్..

ఒకప్పుడు టాలీవుడ్ కే పరిమితమైన రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.. ప్రభాస్ కి టాలీవుడ్ కంటే బాలీవుడ్ లోనే భారీగా క్రేజ్ పెరిగిపోయింది. ప్రభాస్ తన సినిమాలతో అభిమానుల మనసు దోచుకోవడమే కాదు.. తన ఆటిట్యూడ్ తో హీరోయిన్ల మనసు కూడా దోచేసుకున్నారు. ప్రభాస్ వ్వక్తిత్వానికి హీరోయిన్లు ఫిదా అవుతున్నారు.. ముఖ్యంగా ప్రభాస్ లో ఇంత కూడా గర్వం ఉండదు.. అందుకే ప్రభాస్ అంటే ఫ్యాన్స్ కు అంత పిచ్చి.. ఇటీవల ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు చినిపోయినప్పుడు కూడా ఆయన అభిమానుల మనసు దోచుకున్నారు. అంతటి వషాదంలోనూ.. ఆయన పెద్దనాన్న భౌతికకాయాన్ని చూసేందుకు వచ్చిన వారికి భోజనం ఏర్పాటు చేశాడు..

ప్రభాస్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్ చిత్రాల్లో నటిస్తున్నారు. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.. ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక బాలీవుడ్ మీడియాతో ఇంటర్వ్యూలో హీరో ప్రభాస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

కృతి సనన్ మాట్లాడుతూ..‘హీరో ప్రభాస్ కి చాలా సిగ్గు. నేను సినిమా షూటింగ్ సెట్ లో ప్రభాస్ ని మొదటి సారి చూసినప్పుడు చాలా సిగ్గుపడ్డారు. ఆ తర్వాత బ్రేక్ సమయంలో ప్రభాస్ ను కలిసి మాట్లాడాను. తర్వాత వెంటనే నాతో ఫ్రీగా మాట్లాడం మొదలు పెట్టారు. ప్రభాస్ అంత త్వరగా అందరితో కలిసి పోతారని నేను ఊహించలేదు. ప్రభాస్ నిజంగా ఒక స్వీట్ పర్సన్. అలాంటి వ్యక్తితో పని చేయడం ఆనందంగా ఉంది. ఆదిపురుష్ మూవీలో సీత పాత్ర కోసం నాకు హెల్ప్ కూడా చేశారు’.. అని కృతి సనన్ హీరో ప్రభాస్ గురించి చెప్పుకొచ్చారు.. కృతి సనన్ ఒక్కటే కాదు.. గతంలోనూ ప్రభాస్ తో పనిచేసిన హీరోయిన్లు ఆయన గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.

Share post:

Latest