ఆ టాలీవుడ్ హీరో నిర్మాత‌గా.. ఏపీ సీఎం జ‌గ‌న్ బ‌యోపిక్‌…!

సినిమా అనేది ప్రజలపై ఎంతో ప్రభావం చూపిస్తుంది అనేది మనకి ఎప్పటినుంచో తెలుసు. సినిమాల ద్వారా మారిన మనుషులు ఎందరో ఉన్నారు. వాటి ద్వారా దుర అలవాట్లకు గురైన వారు ఉన్నారు. సినిమాలు ఎంటర్టైన్మెంట్‌కే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే అంశాలతో సినిమాలు తీసి ప్రజలను మెప్పించిన వారు ఎందరూ ఉన్నారు. ఉదాహరణకు ఎన్టీఆర్, దాసరి నారాయణరావు అలాంటి పలువురు సమాజానికి ఉపయోగపడే చాలా సినిమాలు తీసి సమాజంలో మార్పు తేవ‌డానికి సినిమాల ద్వారా ఎన్నో ప్రయత్నాలు చేశారు.

NTR - Dasari: నటరత్న ఎన్టీఆర్, దర్శకరత్న దాసరి నారాయణ రావు టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్.. | NTR - Dasari Senior NTR Director Dasari Narayana Rao Tollywood Block Bluster ...

ఈ తరంలో కూడా సమాజానికి ఉపయోగపడే సినిమాలు వచ్చాయి. వాటిలో ముఖ్యంగా జనతా గ్యారేజ్- శ్రీమంతుడు వంటి సినిమాలు భారీ సక్సెస్‌ను అందుకున్నాయి. వీటితో పాటు రాజకీయ నాయకులకు సంబంధించిన సినిమాలు కూడా వచ్చి ప్రజలను బాగా మెప్పించాయి. 2019 ఎలక్షన్‌ల‌కు ముందు నటరత్న ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు- మహానాయకుడు సినిమాలు తీసి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

NTR KN + YSR Yatra = 30 Crores?

వీటితో పాటు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి జీవితంలోని కొన్నిముఖ్యమైన ఘట్టాలు ఆధారంగా యాత్ర సినిమా కూడా వచ్చింది. ఈ రెండు సినిమాలలో యాత్రా సినిమా ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ సినిమా వైసిపి గెలవడానికి చాలా దోహద పడింది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్రను సినిమాగా తీయాలన్న ప్లానింగ్ ఉంద‌ని టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి.

I know the issues of the poor, I want to rule AP for 30 years': Jagan after Yatra | The News Minute

జ‌గ‌న్ జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలను ఆధారంగా చేసుకుని అయ‌న‌ జీవిత చరిత్రను సినిమాగా రూపొందించాలని టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ స్టార్ హీరోనే ఆ సినిమాకు నిర్మాతగా కొనసాగుతాడని తెలుస్తుంది. ఏదేమైనా సీఎం జ‌గ‌న్ బ‌యోపిక్ అంటే పెద్ద సంచ‌ల‌నాలే న‌మోదు అవుతాయి.

Share post:

Latest