ఆ షో ఒక్కో ఎపిసోడ్‌కి సుమ ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు?

యాంకర్ సుమకి వున్న డిమాండ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆమె స్టేజి ఎక్కిందంటే దద్దరిల్లాల్సిందే. తనదైన యాంకరింగ్ తో ఆహుతులను కట్టిపడేయడం ఆమెకి వెన్నతో పెట్టిన విద్య. ఓ సినిమా ఈవెంట్ జరగాలంటే ఆమె అక్కడ తప్పకుండా ఉండాల్సిందే. ముఖ్యంగా పెద్ద పేరున్న బ్యానెర్లు ఆమె లేనిదే షోలు చేయమంటే నమ్మి తిరులసిందే. ఇకపోతే వాటితో పాటు ప్రస్తుతం ఆమె చేస్తున్న షో పేరు క్యాష్. ఈటీవీలో సుదీర్ఘ కాలంగా ప్రసారం అవుతున్న క్యాష్ కార్యక్రమం కు ఇప్పటికీ కూడా భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు అనడంలో సందేహం లేదు.

ఇక ఇన్ని సంవత్సరాలుగా ఒక రియాల్టీ షో ఎందుకు కొనసాగుతోంది అని ఎవరినైనా అడిగితే, కేవలం సుమ ఉండడం కారణంగానే తాము క్యాష్ కార్యక్రమాన్ని చూస్తున్నాం అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వారం కూడా సెలబ్రిటీలను తీసుకు వచ్చి వారితో ఆటలు ఆడిపిస్తూ ఎంటర్టైన్మెంట్ ని పండిస్తున్న క్యాష్ కార్యక్రమంలో సుమది చాలా ప్రత్యేకమైన పాత్ర అని చెప్పుకోవాలి. ఎన్నో డైలాగులను గుర్తు పెట్టుకుంటూ వచ్చిన కంటెస్టెంట్స్ ని మేనేజ్ చేస్తూ ప్రతి ఒక్క విషయంలో శ్రద్ధ తీసుకుంటుంది. కనుకనే ఈ స్థాయిలో రేటింగ్ రావడంతో పాటు ఇన్నాళ్లు కొనసాగుతోంది.

ఇక ఈ రకంగా ఆ షో రక్తి కట్టడానికి సుమ ఎంతగానో పరితపిస్తోంది. ఈ క్రమంలో అనేమందికి ఓ విషయంలో డౌట్ వుంది. ఆ షో చేసినందుకు గాను ఆమెకి రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారు అని? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం క్యాష్ ఒక్క ఎపిసోడ్ కు గాను సుమ 5 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటుందని వినికిడి. 5 లక్షలతో పాటు తన స్టాఫ్ ఖర్చులు అదనం అవి ఒక 50 వేల రూపాయల వరకు అవుతాయి. మొత్తంగా ఐదున్నర లక్షలు ఎపిసోడ్ కు సుమ తీసుకుంటుంది అంటూ సమాచారం అందుతుంది. సుమ క్యాష్ కార్యక్రమం మొదట్లో ఒక్క ఎపిసోడ్ కి 50 వేల నుండి 70 వేల రూపాయల పారితోషకం తీసుకునేదట, కానీ ఇప్పుడు ఆ పారితోషికం ఎన్ని రెట్లు పెరిగిందో చూడండి.

Share post:

Latest