అల్లు అర్జున్ పోయినా ఫర్వాలేదన్న భార్య స్నేహ రెడ్డి… ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

అల్లు అర్జున్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. వచ్చింది పెద్ద కుటుంబ సినీ నేపధ్యం అయినప్పటికీ తనదైన మార్క్ స్టైల్ తో బన్నీ దూసుకెళుతున్న తీరు చూస్తే న భూతొ న భవిష్యతి అని అనకుండా ఉండలేము. మొదట తెలుగు బోర్డర్ దాటి మలయాళంలో కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకున్న మొదటి తెలుగు నటుడు అని చెప్పుకోవాలి. ఇక పుష్ప అనే సినిమాతో ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో హీరో గా కొనసాగుతున్నారు. ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే స్నేహ రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇద్దరు పిల్లలతో వీరి వివాహ బంధం చాలా అన్యోన్యంగా సాగిపోతుంది. అయితే ఈ విషయం పక్కన పెడితే అల్లు అర్జున్ నటించిన “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” అనే సినిమా పెద్ద డిజాస్టర్ అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ, ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది అని చెబుతూ ఉంటాడు బన్నీ. అయితే అప్పట్లో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి గురించి చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు అర్జున్ మాట్లాడుతూ..

“నేను ఈ సినిమా చేద్దామనుకునే టైంలో ఆర్మీ గురించి తెలుసుకొని ఆర్మీలో చేరి పోదామని డిసైడ్ అయ్యాను. అయితే ఈ విషయాన్ని నేను ముందుగా నా భార్య కు చెప్పాను. దానికి స్నేహ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెరీగుడ్… మంచి నిర్ణయం వెళ్ళు అంటూ చెప్పింది. దీంతో నేను ఒక్కసారి షాక్ అయ్యి, అక్కడ నాకు ఏదైనా జరిగితే నువ్వు ఉండగలవా? నేను చనిపోయిన సందర్భం రావచ్చు.. నీకు ప్రాబ్లం రాదా? అని అడిగాను.. దానికి నా భార్య మాట్లాడుతూ.. నో నో నాకు నువ్వు చనిపోయినా పర్వాలేదు. నువ్వు మన దేశం కోసమే మరణిస్తావ్ కదా. నువ్వు ధైర్యంగా ఆర్మీలో జాయిన్ అవ్వు.నేను పిల్లల్ని దగ్గరుండి చూసుకుంటాను!” అంటూ చాలా ధైర్యంగా చెప్పింది. నాకు అప్పుడే నా భార్యకు దేశం మీద ఎంత గౌరవం ప్రేమ ఉందో అర్థమైంది.. అంటూ బన్నీ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Share post:

Latest