అమ్మ చేతివంట బై అమల అక్కినేని… అఖిల్ ,శర్వానంద్ జడ్జెస్..టేస్ట్ ఎలా ఉంటుందో మరి..??

శర్వానంద్ ,రీతూ వర్మ జంటగా శ్రీ కార్తీక్ దర్శకత్వం లో సెప్టెంబర్ 9 న వస్తున్న సినిమా ఒకే ఒక జీవితం..ఇందులో అక్కినేని అమల గారు శర్వానంద్ తల్లి గ నటిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ ని ఎవరు చేయని విధంగా డిఫరెంట్ గ అమ్మ చేతి వంట అని అమల గారు,శర్వానంద్,అఖిల్ తో ప్లాన్ చేసారు..ఇందులో అమల గారు వేగన్ పాయసం చేస్తానని దానికి అఖిల్ ,శర్వానంద్ ని హెల్ప్ చేయమని అడిగారు…

ఇలా ముగ్గురు కలిసి వంట చేసే క్రమం లో చాల విషయాలు ఒకరితో ఒకరు పంచుకున్నారు…నాగ చైతన్య,అఖిల్ లకు ఐస్ క్రీం అంటే చాల ఇష్టం అని చెప్పారు అమల.ఇంకా తాను వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చేస్తానని నాన్ వెజ్ చేయమని తనని ఇంట్లో అడగరాని చెప్పారు.నాన్ వెజ్ వాళ్ళే కుక్ చేసుకుంటారట.శర్వానంద్ కి వాళ్ళ అమ్మ చేసే బిర్యానీ ఇష్టమట..ఇంకా చిరంజీవి గారికి స్టీమ్ దోస ఇష్టం అని,చరణ్ అయితే ప్రతీ ఐటెం ని పెరుగుతో కలుపుకుని తింటాడు కనుక చరణ్ ప్లేట్ అసలు చూడలేమట.అయితే తారక్ మంచి హలీం లవ్ అని తినటమే కాదు తారక్ హలీం చాలా బాగా చేస్తాడని కితాబిచ్చారు అఖిల్,శర్వాలిద్దరు.ప్రభాస్ మంచి ఫుడీ అంట కదా అన్న అమల ప్రశ్నకి వాళ్ళిద్దరి సమాధానం మాత్రం మాములుగా లేదు. ప్రభాస్ హాస్పిటాలిటీ చాల బాగుంటుంది అని,ఎవరిని పిలిచినా డైనింగ్ టేబుల్ మొత్తమ్ ఫుడ్ ఐటమ్స్ తో నింపేస్తారట..అన్ని టేస్ట్ చేయనిదే వదలరట….ఇంకా ప్రభాస్ ఇంట్లో రాజు గారి బిర్యానీ సూపర్ అట.అయితే అమల అత్తగారు,నాగేశ్వర రావు గారి భార్య కూడా ఎవరికైనా ఇంటికి పిలిస్తే టేబుల్ మొత్తమ్ వంటలతో నింపేసేవారట…

అమల గారు ,నాగార్జున గారు ఎపుడైనా ఒక సారి వంట చేస్తారని,అలా నాగార్జున కిచెన్ లో వున్నారంటే ఏదో స్ట్రెస్ లో వున్నారని అర్థం అని చెప్పారు.అయితే కింగ్ నాగ్ స్ట్రెస్ బస్టర్ కుకింగ్ అన్నమాట.అయితే ఎంత టెన్షన్ లో వున్నా కూడా నాగార్జున,అమల కోసం వెజ్ చేయటం మర్చిపోరంటే అయన కి అమల అంటే ఎంత ప్రేమో.టబు కి నాగార్జున ఇంటి ఫుడ్ అంటే చాల ఇష్టం అని,చిన్న చిన్న బౌల్స్ లో డైట్ కి ప్రాబ్లెమ్ అవకుండా అన్ని రకాలు టేస్ట్ చేస్తుందట.ఈ మాటలు కొనసాగుతుండగానే అమల గారు వేగన్ పాయసం రెడీ చేసారు..:రీల్ మరియు రియల్ లైఫ్ కొడుకులిద్దరూ దాన్ని టేస్ట్ చేసి సూపర్ టేస్ట్ అని చెప్పటం కొసమెరుపు..ఏది ఏమయినా ఈ ఒకే ఒక జీవితం సినిమా శర్వా కి ఒక మంచి హిట్ ఇవ్వాలని కోరుకుందాం…

Share post:

Latest