“సీతారామం” చూసిన పోలాండ్ అభిమాని చేసిన పనికి షాక్ అవుతున్న జనాలు..దుల్కర్ ఎమోషనల్..!!

డైరెక్టర్ హను రాఘవపూడి సీతారామం సినిమాను అందమైన ప్రేమ కథగా ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలోని సన్నివేశాలు ప్రతి ఒక్కరి హృదయాలను తాకే విధంగా మలిచాడు దర్శకుడు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ గా తనలోని నట విశ్వరూపం చూపించాడు. హీరోయిన్గా నటించిన మృణాల్ ఠాకూర్ ఇందులో సీతామహాలక్ష్మి పాత్రలో ఒదిగిపోయింది. వీరిద్దరి నటనతో పాటు … విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో అద్భుతం అనే చెప్పాలి.. ఈ సినిమాకి మరో ప్రాణమైన దర్శకుడు హను రాఘవపూడి ఇచ్చిన స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Hanu Raghavapudi: The war in Dulquer Salmaan, Mrunal Thakur's 'Sita Ramam' is an internal battle - The Hindu

ఈ సినిమాను సౌత్ లోనే కాకుండా నార్త్‌లోనూ ఈ సినిమాకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా రీసెంట్గా ఓటీటీలో కూడా విడుదలై మంచి ఆదరణ పొందుతుంది. అలాగే ఈ సినిమాలోని పలు డైలాగ్స్ సన్నివేశాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ… సినిమాని పొగుడుతూ కామెంట్లు పెడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజా సీతారామం సినిమా చూసిన పోలాండ్ దేశానికి చెందిన ఒక అభిమాని ఈ సినిమా పై సోషల్ మీడియా ద్వార‌ ఒక అందమైన ప్రేమలేఖను షేర్ చేశాడు. ఆ అభిమాని రాసిన లేఖను చూసిన దుల్కర్ సల్మాన్ ఎంతో ఉద్వేగానికి గురైయ్యాడు. ఇప్పుడు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sita Ramam Day 18 Box Office Collection Worldwide: Dulquer-Mrunal's Beautiful Love Story Impresses Film Buffs! - Filmibeat

ఆ అభిమాని అయినా మేనికా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సీతారామం చిత్ర యూనిట్ పై ప్రేమను కురిపిస్తూ ఒక అద్భుతమైన నాలుగు పేజీల ప్రేమలేఖను రాసింది… అంతేకాకుండా.. ఈ సినిమాను షారుక్ ఖాన్- ప్రీతి జింటా కలిసి నటించిన వీర్ జారా సినిమాతో పోల్చింది. ఇది ఒక ఎంతో గొప్ప అందమైన ప్రేమ కథ అని చెప్పుకొచ్చింది.. ఈ సినిమాలో నటించిన దుల్కర్ సల్మాన్ ఈ లేఖ‌పై స్పందిస్తూ.. మీరు రాసిన ఈ అందమైన లేఖకు… మీరు చూపిస్తున్న ప్రేమకు నా కృతజ్ఞతలు. నేను మిమ్మల్ని మరింత ఆలరించాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఈ సినిమాపై మీరు ఎంతో గొప్ప అవగాహనతో రాసిన మీ ప్రతిభకు నా జోహార్లు అంటూ దుల్కర్ సల్మాన్ తన రిప్లై ఇచ్చాడు.

Sita Ramam New Song Kaanunna Kalyanam Teaser Out! Dulquer Salmaan & Mrunal Thakur's Chemistry Will Melt Your Hearts

అభిమాని మోనికా… నేను లెఫ్టినెంట్ రామ్ ప్రేమలో పడిపోయాను.. అత‌డిని ప్రేమించకుండా ఉండలేకపోతున్నాను. ఇంత అద్భుతమైన పాత్రను సృష్టించిన డైరెక్టర్ కు నా కృతజ్ఞతలు. అలాగే సీత‌ పాత్రలో మరెవరిని ఊహించుకో లేని విధంగా మృణాల్ నటించింది. మీరు నా హృదయాన్ని ఎంతో ఆనందింప చేశారు. ప్రతి సన్నివేశంలో మీరు ఎంతో అందంగా కనిపించారు. మీరు అచ్చం ఒక దేవకన్యలా ఉన్నారు. అలాగే మీకు గాత్రం అందించిన సింగర్ చిన్నమాయి శ్రీపాద లేకుండా సీతామహాలక్ష్మి పాత్ర అసంపూర్ణం. సీతారామం చిత్ర యూనిట్‌కు నా కృతజ్ఞతలు అంటూ ఆమె తన లేఖలో రాసుకుచ్చింది.

Share post:

Latest