కాపీలతోనే కాలం వెళ్ళదీస్తావా.. తమన్ పై భారీ ట్రోలింగ్..!!

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎస్ఎస్ తమన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈయన అందించే మ్యూజిక్ ప్రేక్షకులలో కొత్త ఆహ్లాదాన్ని అందిస్తుంది అని చెప్పవచ్చు. కానీ గత కొద్ది రోజుల నుంచి సంగీత దర్శకుడు విపరీతంగా ట్రోల్ కి గురవుతున్నాడు. ఎందుకంటే తెలుగు, హిందీ లేదా హాలీవుడ్ చిత్రాల నుంచి మ్యూజిక్ స్కోర్ ను తీసుకొని వాటిని కాపీ కొట్టి తెలుగులో చేస్తున్నాడు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే మరొకసారి ఆయన దొరికిపోయినట్లు తెలుస్తోంది.Godfather' teaser starring Chiranjeevi, Nayanthara gets mercilessly trolled  | Entertainment News | Onmanoramaతాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా కి సంబంధించి ఒక టీజర్ ను విడుదల చేయడం జరిగింది. మెగాస్టార్ అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చేస్తున్న ఈ టీజర్ తాజాగా విడుదల అవడంతో మెగా అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. ఇకపోతే ఈ టీజర్ లో కొన్ని ట్రోలింగ్స్ కూడా గురి అవుతూ ఉండడం గమనార్హం. కొంతమంది చిరంజీవి దుస్తులు , కాస్ట్యూమ్స్ పై జోకులు వేస్తుంటే మరికొంతమంది చిరంజీవికి ఆ లుక్ పెద్దగా సెట్ అవ్వలేదని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ టీజర్ చివరిలో కనిపించడంతో విమర్శలు సైతం గుప్పిస్తున్నారు. ఇక ఆ టీజర్ లో చిరంజీవి పక్కన ఉండగా సల్మాన్ ఖాన్ డ్రైవ్ చేస్తూ ఉంటారు.

ఇకపోతే మీకు పర్ఫెక్ట్ డ్రైవర్ దొరికాడు అంటూ సల్మాన్ ఖాన్ పై విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇందులో ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అందరిని ఆలోచింపచేస్తోంది. ఈ టీజర్ లోనే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని సినిమాలోని టైటిల్ సాంగ్ గుర్తుచేసేలా ఉండడం గమనార్హం. ఇక గని పాట గాడ్ ఫాదర్ బిజిఎం రెండూ కూడా ఒకేలా ఉన్నాయి. ఇక పసిగట్టిన నెటిజన్స్ వెంటనే సినిమా టీజర్ పై ట్రోలింగ్ చేయడమే కాదు.. ఇకనైనా కాపీలు తీయడం మానవా నువ్వు అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

https://twitter.com/Ruthless_Cultt/status/1561348146713612288?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1561348146713612288%7Ctwgr%5Ef9fc8840f6dcb7eb9699eed2ec815d098373f761%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugustop.com%2Fthaman-copied-bgm-from-varun-tej-ghani-to-chiranjeevi-godfather