షూటింగుల బంద్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వీకే నరేష్..!!

ప్రముఖ నటుడు వీకే నరేష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటనపరంగా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో..వ్యక్తిగత విషయంలో కూడా అంతే గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పవచ్చు. ఇక ఈయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు వివాదాలలో ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాడు. ఇకపోతే ఇటీవల ఆయన సినీ ఇండస్ట్రీలో షూటింగుల బంద్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆగస్టు నెలలో విడుదలైన సినిమాల విషయానికే వస్తే.. ఆగస్టు మొదటి వారంలో విడుదలైన సీతారామం , బింబిసార, కార్తికేయ 2 చిత్రాలు సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇక చివరి వారంలో విడుదలైన మాచర్ల నియోజకవర్గం, లైగర్ చిత్రాలు పూర్తిస్థాయిలో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయని చెప్పవచ్చు.

ఇక సినిమా యావరేజ్ గా ఉన్నా సరే ప్రేక్షకులు ఆదరించడం లేదు. అద్భుతంగా ఉంటేనే థియేటర్స్ కి వస్తారు అని ఆయన వెల్లడించారు. ఇకపోతే ఈ పరిస్థితిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. కొందరు ఓటీటీ ఎఫెక్ట్ అంటుంటే.. మరికొంతమంది టికెట్ ధరలు అంటున్నారు.. నిజానికి జనాలు థియేటర్స్ కు ఎందుకు రావడం లేదు? అనే చిన్న ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్ అనే చెప్పాలి అని అంటున్నారు వీకే నరేష్. అసలు విషయంలోకి వెళ్తే ఆయన మాట్లాడుతూ.. మధ్యతరగతి ఫ్యామిలీ థియేటర్లో సినిమా చూడాలి అంటే యావరేజ్ గా రూ. 2,500 ఖర్చు అవుతోంది. టికెట్ ధరలు మాత్రమే కాదు మరెన్నో అంశాలు సామాన్యుడిపై భారంగా మిగులుతున్నాయి.

కేవలం రూ.20 లేదా 30 రూపాయల ఉండాల్సిన పాప్ కార్న్, పెప్సీ ని ₹300 కి అమ్ముతున్నారు. ఇది తప్పకుండా మధ్యతరగతి వారికి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అందుకే జనాలు మంచి సినిమా మాత్రమే కాదు మంచి ఎక్స్పీరియన్స్ ను కూడా కోరుకుంటున్నారు. ఒకసారి థియేటర్ యాజమాన్యం కూడా ఆలోచించాలి. గతంలో యావరేజ్ చిత్రానికి కూడా కలెక్షన్స్ బాగా ఉండేవి. కానీ ఇప్పుడు జనాలు రెండవ రోజే సినిమాకు వెళ్లాలన్న కూడా.. అది గొప్ప ఫిలిం అయితే తప్ప వారు వెళ్లట్లేదు. ఇక సినిమాలు రావాలన్నా.. జనాలు థియేటర్స్ కి వెళ్లాలన్నా ధరలు తగ్గించాల్సిందే అంటూ నరేష్ కామెంట్స్ చేశారు.

Share post:

Latest