పెళ్లికాకముందే ఫస్ట్ నైట్ కావాలంటున్న యాంకర్ విష్ణుప్రియ… రెండు సార్లు అంటూ నోరు జారింది?

తెలుగు బుల్లితెర యాంకర్లలో సుమ, ఉదయభాను, అనసూయ, రష్మీ తరువాత మనకి వినబడే పేరు విష్ణుప్రియ. అవును… పొడుగు కాళ్ళ సుందరి విష్ణుప్రియ భీమనేని అంటే తెలియని తెలుగు కుర్రకారు ఉండరనే చెప్పుకోవాలి. మోడలింగ్ రంగం నుంచి బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. అనతికాలంలోనే మంచి ఫాలోయింగ్‌ను అందుకుంది. ఫలితంగా వరుస షోలతో హవాను చూపించింది ఇకపోతే ఈమె తాజాగా ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ యూనిట్‌తో తాజాగా క్యాష్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది.

కాగా ఈ షోలో విష్ణుప్రియ.. పెళ్లి, ఫస్ట్ నైట్ గురించి కామెంట్ చేసింది. టీనేజ్‌లో ఉన్నప్పుడే విష్ణుప్రియ ‘చెక్‌మేట్’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. కానీ, ఈ మూవీ అప్పుడు రిలీజ్ కాలేదు. అయితే, 2020లో ఇది ఓటీటీలో ఈ సినిమా నేరుగా రిలీజ్ అయింది. అందులో ఈ బ్యూటీ క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లతోనూ రెచ్చిపోయింది. ఫలితంగా ఈ చిత్రానికి రెస్పాన్స్ మంచిగానే వచ్చింది. సినిమాలో నటించిన తర్వాత గ్యాప్ తీసుకున్న విష్ణుప్రియ.. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇకపోతే సునీల్‌, అనసూయ, సుడిగాలి సుధీర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వాంటెడ్‌ పండుగాడ్‌’. శ్రీధర్‌ సీపాన తెరకెక్కించిన ఈ మూవీని కే రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్‌ కె ప్రొడక్షన్స్‌ పతాకంపై సాయిబాబ కోవెలమూడి, వెంకట్‌ కోవెలమూడి నిర్మిస్తున్నారు. ఇందులో విష్ణుప్రియ ఓ కీలక పాత్రను పోషించింది. ఇది ఆగస్టు 19న విడుదల కాబోతుంది. అదంతా పక్కనబెడితే ‘క్యాష్’ షోలో భాగంగా గేమ్ ఆడడానికి వచ్చిన విష్ణుప్రియకు 2 ఆపిల్స్ ఇచ్చారు. అప్పుడామె ‘శ్రావణ మాసంలో నాకు రెండు పళ్లు ఇచ్చారు. పెళ్లైన తర్వాత పళ్లతో హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నా’ అంటూ కామెంట్ చేసింది. దీంతో అక్కడున్న వాళ్లంతా నవ్వేశారు. ఇక, విష్ణుప్రియ పరోక్షంగా ఫస్ట్ నైట్ గురించి ఆమె మాట్లాడిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest