కోబ్రా సినిమా కోసం అన్ని కోట్లు తీసుకున్న విక్రమ్..!!

హీరో విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. విలక్షణమైన నటుడుగా విలక్షణమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటాడు చియాన్ విక్రమ్. పాత్ర కోసం ఎలాగైనా మారుతూ ఉంటాడు. ప్రతి సినిమాలో కూడా విభిన్నమైన గెటప్లలో కనిపించి ప్రేక్షకుల సైతం ఆశ్చర్యపరిచేలా చేస్తూ ఉంటాడు. అలా నటించిన చిత్రాలలో అపరిచితుడు, ఐ సినిమాలు ఉదాహరణ అని చెప్పవచ్చు. అయితే విక్రమ్ తాజాగా నటిస్తున్న కోబ్రా సినిమా ఒకేసారి తెలుగు, తమిళ్ ,హిందీ వంటి భాషలలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం ఆగస్టు 31న విడుదల కాబోతోంది.Cobra' movie first look: Vikram essays seven characters in his next  thriller - The Hinduఇక కోబ్రా సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు కోలీవుడ్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తున్నాయి. ఇ చిత్రానికి హీరో విక్రమ్ భారీగా రెమ్యూనికేషన్ తీసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి చూద్దాం. సినిమాను బట్టి హీరో విక్రమ్ రేమ్యునరేషన్ తీసుకుంటూ ఉంటాడు. ప్రతి చిత్రానికి రూ.20 కోట్ల నుంచి 25 కోట్ల వరకు తీసుకుంటూ ఉంటాడు. ఇక కోబ్రా సినిమాకు రూ.25 కోట రూపాయల రెమ్యూనికేషన్ తీసుకున్నాడని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ సినిమా బడ్జెట్లో ఇది 22% అన్నట్లుగా సమాచారం.Cobra trailer out: Finally, here's the reason behind the title of Vikram's  next | Entertainment News,The Indian Express

ఈ చిత్రంలో విక్రమ్ మరొకసారి 10 గెటప్పులలో కనిపించనున్నారు. ఇందుకోసం చాలా శ్రమించినట్లుగా కూడా తెలుస్తోంది అందువల్లనే చిత్ర మేకర్స్ ఈ సినిమాకి విక్రమ్ డిమాండ్ చేసినంత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకి డైరెక్టర్ గా ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. ఈ సినిమా యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో విక్రమ్ గణిత శాస్త్రవేత్తడుగా కూడా కనిపించబోతున్నాడు. సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందించారు. ఇక ఈ చిత్రంలో ఇర్ఫాన్ పఠాన్ ,మియా జార్జ్ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.

Share post:

Latest