మ‌హేష్‌, ప్ర‌భాస్‌ను మించిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్‌… !

సినిమా పరిశ్రమలో హీరోలకి హీరోలకి మధ్య పోటీ ఉండటం సహజం. ఇదే క్రమంలో హీరోల సినిమాలు ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి? ఎక్కడెక్కడ రిలీజ్ అవుతున్నాయి? అనేది కూడా ఎన్నో చర్చలు జరుగుతుంటాయి. టాలీవుడ్ పరిశ్రమకు వచ్చేసరికి ఇక్కడ అగ్ర హీరోలుగా కోనసుగుతున్న పవన్ కళ్యాణ్- ప్రభాస్- ఎన్టీఆర్- రామ్ చరణ్- మహేష్ బాబు- అల్లు అర్జున్ వంటి హీరోల అందరి సినిమాలు విషయంలో ఇలాంటి చర్చలు అభిమానుల్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఏ అగ్ర హీరో సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న ఆ హీరో అభిమానులు చేసే రచ్చ మరో లెవల్ లో ఉంటుంది.

హీరోల మధ్య పోటీయే కాకుండా అభిమానుల్లో కూడా పోటీ చాలా విపరీతంగా ఉంటుంది. అభిమానులు మా హీరో గొప్ప అంటూ చేసే రచ్చ అంత ఇంతా కాదు. ఇప్పుడు తాజాగా ఏ హీరో సినిమాలు ఎక్కువ థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి.. క‌లెక్ష‌న్లు ఎంత అనేది ఒక ట్రెండ్ గా మారింది. అయితే ఈ రోజు విడుదలైన లైగ‌ర్ సినిమా ఎన్ని స్క్రీన్ లో రిలీజ్ అయింది అని చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతుంది. పాన్ ఇండియా వైడ్ గా సినిమా గురించి సోషల్ మీడియా కానీ ఎక్కడ చూసినా ఎవరి నోటి నుంచి వచ్చిన లైగ‌ర్ గురించే న‌డుస్తోంది.

Vijay Deverakonda's Liger To Mahesh Babu's Sarkaru Vaari Paata Tollywood Leading PROs Vamsi-Shekar Discloses The Statuses Of Upcoming Telugu Movies

స్టార్ హీరోలు మహేష్ బాబు- ప్రభాస్- పవన్ కళ్యాణ్ సినిమాలను కంటే లైగ‌ర్ సినిమా ఎక్కువ ధియేటర్లో రిలీజ్ అవుతోంద‌ట‌. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మన పొరుగు రాష్ట్రమైన బెంగళూరులో కూడా ఈ ఇటీవ‌ల కాలంలో తెలుగు సినిమాలు భారీ స్థాయిలో విడుదలవుతున్నాయి. బెంగళూరులో మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా 591 స్క్రీన్ లో రిలీజ్ అయింది. ఇప్పటివరకు ఇదే టాప్ ప్లేస్ లో నిలిచింది. తర్వాత ప్రభాస్ రాధేశ్యామ్ 525 స్క్రీన్ లో, చిరంజీవి ఆచార్య 400 స్క్రీన్ లో, పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ 380 స్క్రీన్ లో రిలీజ్ అయ్యాయి.

Bheemla Nayak Trailer Will Be Out On This Date

అయితే తెలుగు స్టార్ హీరోల సినిమాలను మించి లైగ‌ర్ సినిమా ఏకంగా 630 స్క్రీన్ ల‌లో విడుదలవుతుంది. విజయ్ దేవరకొండ కూడా లైగ‌ర్‌ సినిమాతో స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు అనే టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో ప్రపంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా నటించడం చెప్పుకోదగ్గ విశేషం. అయితే సినిమాకు తొలి రోజే మిక్స్ డ్‌, డివైడ్ టాక్ కంప్లీట్‌గా వ‌చ్చేసింది.

Share post:

Latest