ఇంట్రెస్టింగ్: అది ఉంటే సినిమా అట్టర్ ఫ్లాపే..ఇదే ప్రూఫ్..!!

పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమా గురువారం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లైగర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు అంటూ రివ్యూలు వస్తున్న సమయంలో ప్రేక్షకులు నుంచి కూడా నెగిటివ్ టాక్‌ వచ్చింది. విజయ్ దేవరకొండ ఫైటర్ గా చూపించడం బాగానే ఉన్నా… నత్తి వాడిగా చూపించడం.. మైక్ టైసన్ ని కూడా జోకర్ ని చేశారంటూ విమర్శలు వస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే గ‌తంలో ఫైట‌ర్ కాన్సెఫ్ట్‌తో వ‌చ్చిన సినిమాలు కూడా ఎక్కువుగా ప్లాప్ అయ్యాయంటూ ఓ చ‌ర్చ న‌డుస్తోంది. పవన్ కళ్యాణ్ త‌మ్ముడు సినిమా హిట్‌. ఈ సినిమా ముందు ఇలాంటి సినిమాలు వచ్చినా.. ఆకట్టుకోలేకపోయాయి. ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా బాగా నచ్చింది.. తమ్ముడు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ త‌ర్వాత రవితేజ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి బాక్సింగ్ – ఫైటింగ్ నేపథ్యంలోనే వచ్చి హిట్ అయ్యింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా తన సొంత డైరెక్షన్లో జానీ సినిమా చేస్తే ప్లాప్‌. ఇది కూడా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. రీసెంట్‌గా వ‌రుణ్ తేజ్ గని సినిమా కూడా బాక్సింగ్ నేపథ్యంలో వచ్చి డిజాస్ట‌ర్ అయ్యింది. ఇక ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండ లైగ‌ర్ కూడా బాక్సింగ్‌, ఫైట‌ర్ క‌థాంశంతో వ‌చ్చింది.

ఈ సినిమా విజ‌య్ కెరియర్ లోనే భారీ అట్టర్ ప్లాప్ సినిమాగా నిలిచింది. ముందు ముందు బాక్సింగ్ బ్యాగ్ డ్రాప్‌ లో సినిమాలు తీయాలంటే మేకర్స్ భయపడాల్సిన పరిస్ధితి నెలకొంది. జానీ నుంచి మొదలుకొని లైగ‌ర్‌ సినిమా వరకు బాక్సింగ్ కాన్సెప్ట్ లో వచ్చిన సినిమాలన్నీ ప్లాఫే. ఈ సినిమాల రిజల్ట్ చూశాక బాక్సింగ్ డ్రాప్ లో సినిమాలు రావటం అనేది కష్టమే అని తెలుస్తుంది.

Share post:

Latest