హీరోయిన్ రేంజ్ లో టిక్ టాక్ భాను పారితోషకం..అందుకేనా..?

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా తమ ప్రతిభను నిరూపించుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీని తెచ్చుకుంటున్నారని చెప్పవచ్చు. ఇకపోతే టిక్ టాక్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలలో కూడా ప్రేక్షకులను సందడి చేస్తున్న భానుకు.. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఆమె అందానికి ఫిదా అయిన కుర్ర కారు ఆమెకు ఫాలోవర్స్ గా మారిపోతున్నారు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో 1.5 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది భాను. ఇక ఈ ఫేమ్ తోనే భాను జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశాన్ని దక్కించుకుంది. అక్కడ కూడా పలు ఈవెంట్లకి హాజరవుతూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది.

- Advertisement -

Bhanu1006 (Tiktok Star) Wiki, Bio, Age, Height, Parents, Boyfriend,  Wikipedia, Images and Moreఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా భారీగా సంపాదిస్తుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే మిడిల్ రేంజ్ హీరోయిన్ లా ఆ రేంజ్ లో పారితోషకం అందుకుంటుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఒక్క ఎపిసోడ్ కోసం భాను ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది అనే విషయాన్ని చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఒక ఎపిసోడ్లో భాను కనిపిస్తే సుమారుగా రూ.1.25 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంచుమించు మిడిల్ రేంజ్ హీరోయిన్ లాగా ఈమె కూడా పారితోషకం తీసుకుంటుంది. సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్ పాపులారిటీని చూసే ఆ రేంజ్ లో పారితోషకం ఇస్తున్నారని సమాచారం.Tik Tok Star Bhanu : టిక్ టాక్ స్టార్ భాను.. నిజ జీవితంలో ఎలా ఉంటుందో  తెలుసా.. Tik Tok Star Bhanu beautiful pics– News18 Telugu

అంతేకాదు బుల్లితెరపై ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకొని వెండితెరపై కూడా అవకాశాలను సంపాదించుకుంది. ఇక ఒకసారి వెండితెరపైకి వెళ్లి అవకాశాలు లేకపోతే తిరిగి బుల్లితెర కార్యక్రమాలకు వచ్చే అవకాశం ఉండదన్న ఉద్దేశంతోనే తాను బుల్లితెర కార్యక్రమంలోని కొనసాగుతున్నానని తెలిపింది. ఇక సినిమా ఆఫర్లు వస్తున్నా వెళ్లకుండా బుల్లితెర పైనే తన ప్రస్తానాన్ని కొనసాగించేలాగా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ క్రేజ్ తోనే యాంకర్ గా దర్శనమిచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

Share post:

Popular