ఎన్టీఆర్ మెచ్చిన పవన్ కళ్యాణ్ మూవీ ఇదే..!!

సాధారణంగా స్టార్ హీరోలు తెరకెక్కించే సినిమాలు అభిమానులకు మాత్రమే కాదు పక్క హీరోలకు కూడా నచ్చుతాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఇక అలా ప్రస్తుతం ఉన్న బడా స్టార్ హీరోలు తెరకెక్కించిన ఎన్నో సినిమాలను మరికొంతమంది స్టార్ హీరోలు మెచ్చుకుంటున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి పవన్ కళ్యాణ్ నటించిన ఆ సినిమా అంటే ఎంతో ఇష్టమట. ఇక ఆ సినిమా గురించి మనం ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.Jr NTR hugged Pawan Kalyan after watching Vakeel Saab: Prakash Raj | Telugu  Movie News - Times of India

1998 లో పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం తొలిప్రేమ.. ఈ సినిమా అప్పట్లో ఎంత విజయాన్ని సొంతం చేసుకుందో మనం చెప్పక్కర్లేదు. ఇందులో హీరోయిన్ గా పవన్ కళ్యాణ్ సరసన కీర్తి రెడ్డి నటించారు. ఇక స్వచ్ఛమైన ప్రేమకథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటించిన తొలి చిత్రం సినిమా అంటే ఎన్టీఆర్ కి విపరీతమైన ఇష్టమట. అంతే కాదు ఈ సినిమాను సమయం దొరికితే చాలు వీక్షిస్తూ ఉంటారట ఎన్టీఆర్. ఇక ఈ విషయం చెప్పగానే పవన్ కళ్యాణ్ అభిమానుల సైతం తెగ సంబరపడిపోతున్నారు.Watch Tholi Prema - Disney+ Hotstar

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈయన పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు. అంతే కాదు ఈ సినిమాతోనే ఆస్కార్ బరిలో నిలవబోతున్నారు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సన ఆ తర్వాత ప్రశాంత్ నీల్ వంటి దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో కూడా బిజీబిజీగా గడుపుతున్నారు.

Share post:

Latest