పెళ్లికి ఒప్పుకోలేదు.. వాళ్లే బ్యాన్ చేస్తామంటూ బెదిరించారు.. క్లారిటీ ఇచ్చిన నిత్యా మీనన్..!!

తెలుగు చిత్ర పరిశ్రమలో నిత్యమీనన్ చాలా సెలెక్టివ్ పాత్రలు మాత్రమే చేస్తూ ఉంటుంది అని ఆమెకు ఒక గుర్తింపు కూడా ఉంది . నిజానికి ఏవి పడితే అవి చేయకుండా తన వ్యక్తిత్వానికి భంగం కలగకుండా ఉండే పాత్రలను మాత్రమే ఎంచుకుంటుంది అనడంలో సందేహం లేదు. మలయాళం ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో తన అందంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా నిత్యామీనన్ అందానికి ఆమె కళ్ళే పెద్ద ప్లస్ పాయింట్ అని చెబుతూ ఉంటారు. పలు సినిమాల ద్వారా హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీనన్ ఇటీవల వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ తనకంటూ ఒక ఇమేజ్ను సొంతం చేసుకుంది.Nithya Menen clears air on marriage rumours- Cinema express

పవన్ కళ్యాణ్ సరసన భీమ్లా నాయక్ సినిమాలో నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న నిత్యమీనన్, మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి సక్సెస్ పొందింది. ఇక వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని దుర్ఘటన సంఘటనలు కూడా ఆమె వెల్లడించినట్లు ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇకపోతే హీరోయిన్ గా, సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీనన్ ఇటీవల స్కైలాబ్ చిత్రం ద్వారా నిర్మాతగా కూడా మారింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే గత కొన్ని రోజుల నుంచి నిత్యామీనన్ వివాహం చేసుకోబోతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతూ ఉండగా ఈ విషయంపై నిత్యామీనన్ క్లారిటీ ఇచ్చింది.Pic Talk: Nithya Menon Looks Luscious - Movie News

నిత్యామీనన్ మాట్లాడుతూ.. నేను వివాహం చేసుకోవడం లేదు. అన్ని అవాస్తవాలే.. ఎవరో కావాలని క్రియేట్ చేసి ఇలా రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఒక సంవత్సరం నుంచి నేను గ్యాప్ లేకుండా వరుసగా సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాను .ఇక అదే సమయంలో కాలు బెణికింది. దాంతో కొంచెం రెస్ట్ తీసుకున్నాను. ఆ సమయంలోనే కథలు చెబుతామని వచ్చినా.. రెస్ట్ తీసుకోవాలని ఉద్దేశంతోనే నేను కథలు వినలేదు. ఇక అప్పుడే నిత్యమీనన్ ఎందుకు కథలు వినడం లేదు అనే ప్రశ్న మొదలైంది.. అంతేకాదు నిత్యామీనన్ కథలు వినడం లేదు అంటే పెళ్లి చేసుకుంటుందేమో అనే వార్తలు కూడా సృష్టించారు ఇదంతా అబద్ధం అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ఒక స్టార్ హీరోను వివాహం చేసుకోమని అడిగితే నిరాకరించింది. ఇక ఈమెను బ్యాన్ చేశారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. అంతేకాదు ఎవరైనా పైకి ఎదుగుతున్నారు అంటే కిందికి లాగడానికి కొంతమంది ఇష్టపడతారు ఇక ఆ విధంగానే నాపై పూర్తిగా రూమర్స్ క్రియేట్ చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది నిత్యా మీనన్.