నటుడు సుమన్ సహా జైలు జీవితం గడిపిన సినిమా స్టార్స్ వీరే!

సినీస్టార్లంటే దేవుళ్లుగా చూసే జనాలు వారు కూడా సగటు మానవులే అని రుజువు చేసే సంఘటనలు అనేకం జరుగుతుంటాయి. తప్పు చేస్తే వారు కూడా చట్టం నుండి తప్పించుకోలేరు అని తెలిపే కొన్ని సంఘటనలు వారి వారి పర్సనల్ లైఫ్ లో జరుగుతూ ఉంటాయి. ఇకపోతే తెలుగు హీరో సుమన్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తనది మన రాష్ట్రం కాకపోయినా కూడా ఇక్కడే స్టార్ గా గుర్తింపు సాధించుకున్నాడు సుమన్. బేసిగ్గా కన్నడకి చెందిన వ్యక్తి అయినప్పటికీ అతనిని తెలుగువాడిగానే చూసారు ఇక్కడి జనం.

కాగా సుమన్ కెరీర్‌ పీక్స్‌లో వుంది అనగా సరిగ్గా అదే సమయంలో ఓ అనుకోని సంఘటన వలన అతగాడు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఓ పోర్నోగ్రఫీ కేసులో సుమన్ కొన్ని నెలలు జైలు శిక్ష అనుభవించారు అనే ఆరోపణలు వున్నాయి. తరువాత ఈ కేసులో ఆయన్ని అక్రమంగా ఇరికించినట్టు తేలడంతో ఆయన నిర్ధోషిగా విడుదలయ్యారు. అప్పటికే హీరోగా ఆయనకు జరగాల్సిన నష్టం జరిగింది. ఇక తెలుగు సహా మిగతా దక్షిణాది పరిశ్రమలో సుమన్ ఒక్కరే జైలు జీవితం గడపాల్సి రావడం ఒకింత దురదృష్టకరం.

ఇక బాలీవుడ్‌ చూసుకుంటే, ఇక్కడ జైలు జీవితం గడిపిన సెలబ్రిటీలు ఇక్కడ చాలా మంది కలరు. 1998లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్ట్ ఐదేళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసినదే. అలాగే బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్.. 1993లో ముంబై బాంబ్ పేలుళ్లతో పాటు అక్రమాయుధాలు కలిగియున్న కేసులో జైలు శిక్ష అనుభవించారు. ఆమధ్య సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో రియా చక్రబర్తిని ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో‌ అరెస్ట్ చేసింది. బాలీవుడ్ అంటే విందులు వినోదాలకు మాత్రమే కాదు.. వివాదాలకు కేంద్ర బిందువు అన్నట్టు ఉండేది. తాజాగా బాలీవుడ్ బాద్‌షా తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కొన్ని రోజులు ఆర్ధర్ రోడ్ జైల్లో గడిపిన సంగతి విదితమే. అలాగే ప్రస్తుతం రాజ్ కుంద్రా వ్యవహారం సంచలనంగా మారింది.

Share post:

Latest