కావాలనే తన మీద తాగి పడ్డారంటున్న నటి..!!

సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక నటి స్టార్ హీరోయిన్ గా అవ్వాలని ఎంట్రీ ఇచ్చింది. స్టార్ హీరో సినిమాతోనే ఆమె సపోర్టింగ్ రోల్ లో నటించింది. అటుపై ఒక సంచలన డైరెక్టర్ తన సినిమాలో ఆమెకు మెయిన్ లీడ్ గా అవకాశం కల్పించారు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది . అయినా పట్టు వదలలేదు వచ్చిన అవకాశాలను అందించుకుంటూ నటిగా బాగా పాపులర్ అయింది. పరిశ్రమలో తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నది ఈమె. ఈ క్రమంలోనే బిగ్ బాస్ లోనూ ఎంట్రీ ఇచ్చింది . ఆ గుర్తింపు నటిగా కన్నా మరింత పాపులర్ అయ్యేలా చేసింది.

ఇక మధ్య మధ్యలో మెయిన్ లీడ్స్ లో మరికొన్ని సినిమాలతో మెప్పించే ప్రయత్నం చేసింది కానీ.. తన డ్రీమ్ వేరే ఉందని ఇంకా ఫుల్ కాలేదని తెలియజేసింది. అలాగని నిరాశ పడి ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. ఈ నేపథ్యంలోని ఇటీవల మరొక బిగ్ బాస్ అవకాశం కూడా అందుకుంది. ఈ సినిమా నేపథ్యంలోని ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న ఒక బర్నింగ్ టాపిక్ ని బేస్ చేసుకుని ఆ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఆ చిత్రానికి బాగా కనెక్ట్ అయిపోయింది. తనలో ధైర్యశాలిని మరొకసారి ఈ సినిమాతో తట్టి లేపుతున్నట్టుగా సమాచారం. ఇక సినిమా ప్రచారంలో భాగంగానే ఆమె చేసిన వాక్యాన్ని బట్టి ఇండస్ట్రీలో ఎన్నో విషయాలను నేర్పినట్లుగా తెలియజేసింది.

ఇండస్ట్రీలో సక్సెస్ కావాలి అంటే పరిశ్రమలో ఎలా నడుచుకోవాల్సి ఉంటుంది అనే అంశంపై కూడా ఆమె చూపించబోతున్నట్లు సమాచారం. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు మరో వర్ధమాన నటి అనుభవాలను సైతం చూపించబోతున్నట్లుగా సమాచారం. తాజాగా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె తన అనుభవాలను పంచుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్త అమ్మాయి పట్ల కొంతమంది ఎలాంటి ఆలోచనలతో ఉంటారు? ఎలాంటి ప్రవర్తనలతో ప్రవర్తిస్తారు? అనే విషయాన్ని తెలిపింది. ఇక అలా ఒకసారి తెలంగాణలో ఒక జిల్లాలో నిర్వహించిన సినిమా ఈవెంట్ కు వెళుతూ ఉంటే మార్గం మధ్యలో కొందరు ఆకతాయిలు.. మద్యం సేవించి తన మీద పడిపోయారని తాను ఎవరో తెలిసే దుండగులు అలాంటి చర్యలకు పాల్పడ్డారని తెలియజేసింది. కానీ ఆ ఘటన నుంచి చాలా తెలివిగా ఎస్కేప్ అయినట్లుగా సమాచారం.

Share post:

Latest