చీరకట్టులో మెరిసిపోతున్న మిల్క్ బ్యూటీ.. పరువాలు బరువైపోయాయా తమన్నాకి?

మిల్క్ బ్యూటీ తమన్నా పరిచయం నేటి కుర్రకారుకి అవసరం లేదు. 32 ఏళ్ళ తమన్నా ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో తన సత్తాని చాటుతోంది. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అనౌన్స్ చేసిన తమన్నా ప్రస్తుతం వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో పడింది. అలాగే ఓ వైపు బాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్ట్ లకు సైన్ చేస్తూ బిజీగా గడుపుతోంది. తమన్నా ఓ వైపు సినిమాలతో అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియా ద్వారా ఇంటర్నెట్ ఫ్యాన్స్ ను ఆకర్షిస్తోంది. తాజాగా ఓ ఫోటో షూట్ లో పాల్గొన్న మిల్కి నెటిజన్ల మతిపోగొడుతోంది.

సోషల్ మీడియా వేదికగా చీరకట్టులో కొన్ని గ్లామర్ పిక్స్ ను తన అభిమానులతో పంచుకుంది. అయితే ఈ గ్లామర్ పిక్స్ ఇంటర్నెట్ నే షేక్ చేసేలా ఉన్నాయి. గుప్పెడంత అందంతో కుర్రాళ్ల గుండెల్ని దోచుకునే పనిలో పడింది తమన్నా. సాంప్రదాయ చీరకట్టులో దర్శనమివ్వడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. గ్రీన్ శారీలో, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో పరువాలను విందు చేస్తోంది. చాలా రోజుల తర్వాత తమన్నా ఇలా చీరకట్టులో కనువిందు చేయడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గ్లామర్ బ్యూటీ ఒంపుసొంపులకు నెటిజన్లు మంత్రముగ్ధులవుతున్నారు.

ఇప్పటికే కాన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైన తమన్నా.. తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్స్ లో నిర్వహిస్తున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైంది. అవుట్ ఆఫ్ ఇండియాగా భారతీయ సినిమా 13వ వార్షిక వేడుకను ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 12 నుంచి 30 వరకు ఈ వేడుకలు గ్రాండ్ గా జరగనున్నాయి. ఈ ఫెస్టివల్ కోసమే తాజాగా చీరకట్టులో తమన్నా హాజరై అందరినీ ఆకట్టుకుంది. ఆ పిక్స్ నే సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. IFFMకు రాజీవ్ మసాంద్, వాణీ కపూర్, జానకీ ఈశ్వర్, అభిషేక్ బచ్చన్, షెఫాలీ షా, తమన్నా భాటియా హాజరవుతున్నారు.

Share post:

Latest