తేజస్వి..రోజుకో 30 మంది వస్తారు.. ఇండస్ట్రీ లో కమిట్మెంట్ ఎలా అడుగుతారంటే..?

తేజస్వి మదివాడ.. గత కొద్ది రోజుల నుంచి వివాదాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా కమిట్మెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇండస్ట్రీలో జరిగే క్యాస్టింగ్ గురించి కమిట్మెంట్స్ గురించి ఓపెన్ అయింది. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వీటిని కొంతమంది సీనియర్ హీరోయిన్లు కూడా బయటకు చెబితే.. కానీ మరి కొంతమంది వాటిని లోపలే దాస్తున్నారని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా కమిట్మెంట్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న తేజస్వి మదివాడ సినీ ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఎలా అడుగుతారు? అనే విషయంలో కూడా ఆమె వివిధ రకాల ఉదాహరణలను తెలియజేసింది.tejaswini as a heroin – Latest Telugu News Updatesతేజస్వి మాట్లాడుతూ.. ఒక సినీ ఇండస్ట్రీలోనే కాదు ప్రతి ఒక్కరి దగ్గర ఇలాంటి వేధింపులు అనేవి ఉంటాయి. కాకపోతే సినిమా పరిశ్రమ ఎప్పుడూ హైలైట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అందరి ఫోకస్ ఇక్కడే ఎక్కువగా ఉంటుంది అంటూ ఆమె చెప్పింది. ఇకపోతే క్యాస్టింగ్ కౌచ్ విషయంలో దర్శకులు కూడా చాలాసార్లు తప్పులు చేసినట్లు కొంతమంది హీరోయిన్స్ ఓపెన్ అయ్యారు. మరి కొంతమంది ఎదిరించి కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నట్లు తేజస్వి తెలియజేస్తున్నారు. కమిట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? అలాగే దానిని ఎలా ఎదుర్కోవాలి? అనే విషయాలపై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది ఈ ముద్దుగుమ్మ.

ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైనప్పుడు ఇండస్ట్రీ మొత్తం బాగాలేదు అనడం కరెక్ట్ కాదు. ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైనప్పుడు ఎదుర్కోవాలి.. లొంగిపోకుండా, తప్పు చేయకుండా.. ముందే ఎదుర్కొంటే అక్కడితోనే ఆ మేటర్ క్లోజ్ అవుతుంది. లొంగిపోయిన తర్వాత నన్ను మోసం చేశారు అనేది మాత్రం కరెక్ట్ కాదు అంటూ కొంతమందిని ఉద్దేశించి ఘాటుగా స్పందించింది. అంతేకాదు నన్ను కూడా చాలాసార్లు కమిట్మెంట్ అడిగారు. కొన్నిసార్లు ఈవెంట్స్ కు వెళ్ళినప్పుడు ఈవెంట్ ముగిసిన తర్వాత చాలామంది వచ్చేవారు. ఒకరోజు రాత్రి ఫుల్లుగా తాగేసి 30 మంది నన్ను చుట్టుముట్టేశారు అని తేజస్వి తెలియజేసింది. అప్పుడు మనం ఎంత తెలివిగా తప్పించుకోగలిగాము అన్నదే అక్కడ పాయింట్ అంటూ కానీ తాను మాత్రం అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఏడ్చి పరిగెత్తినట్లు తేజస్వి వెల్లడించింది.

Share post:

Latest