వైసీపీ కోటలో టీడీపీకి భలే ఛాన్స్!

ఆ నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది కేవలం రెండుసార్లు మాత్రమే..ఇక గత రెండు ఎన్నికల్లో అక్కడ వరుసగా వైసీపీ హవా కొనసాగుతుంది. మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. కానీ వైసీపీ హ్యాట్రిక్ విజయానికి టీడీపీ బ్రేక్ వేసేలా ఉంది..చాలా ఏళ్ల తర్వాత అక్కడ టీడీపీ జెండా ఎగిరేలా ఉంది. ఇంకోచెం కష్టపడితే ఆ సీటు టీడీపీకి దక్కే ఛాన్స్ ఉంది.

అలా వైసీపీ హ్యాట్రిక్ విజయానికి అడ్డు వేస్తూ…టీడీపీ దూకుడు మీదున్న నియోజకవర్గం ఏదో కాదో…ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు. ఈ నియోజకవర్గం మొదట నుంచి టీడీపీకి అనుకూలంగా లేదు. పార్టీ ఆవిర్భావం తర్వాత అంటే 1983 నుంచి 2019 వరకు సంతనూతలపాడులో 9 సార్లు ఎన్నికలు జరిగాయి..అందులో టీడీపీ కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ మూడుసార్లు, సి‌పి‌ఎం ఒకసారి, ఇండిపెండెంట్ ఒకసారి గెలిచారు. ఇక గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది.

అయితే టీడీపీ చివరిగా గెలిచింది 1999 ఎన్నికల్లోనే.. ఆ తర్వాత నుంచి అక్కడ టీడీపీ గెలవలేదు. వరుసగా నాలుగు ఎన్నికల్లో ఓడిపోయింది. గత రెండు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి బి‌ఎన్ విజయ్ కుమార్ ఓడిపోతూ వస్తున్నారు. కానీ ఈ సారి మాత్రం ఖచ్చితంగా గెలవాలనే కసితో పనిచేస్తున్నారు…నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు…కార్యకర్తలకు అండగా ఉంటున్నారు…అలాగే వైసీపీకి చెందిన బలమైన నాయకులని టీడీపీలోకి లాగుతున్నారు.

ఈ మూడేళ్లలో ఇక్కడ వైసీపీపై నెగిటివ్ పెరగగా, టీడీపీకి పాజిటివ్ పెరిగిందని సర్వేల్లో తేలింది.  ఈ సారి ఇక్కడ వైసీపీ గెలుపు చాలా కష్టమవుతుందని అంటున్నారు. అయితే టీడీపీ నేత విజయ్ ఇంకా కష్టపడితే…డౌట్ లేకుండా సంతనూతలపాడులో టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంది. తాజాగా చంద్రబాబు సైతం…నియోజకవర్గంలో ఇంకా బలపడటానికి విజయ్ కు పలు సూచనలు కూడా చేశారు. ఇక నుంచి విజయ్ ఇంకా దూకుడుగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. మరి చూడాలి ఈ వైసీపీ కోటలో ఈ సారి టీడీపీ సత్తా చాటుతుందేమో.