సీనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాకు … నాగార్జున సినిమాకు ఇంత లింక్ ఉందా…!

ఒక్కోసారి హిట్ అవుతుందని భావించిన సినిమా ఘోర పరాజయం పాలవుతుంది. అంచనాలు లేని సినిమాలు సూపర్ హిట్లుగా మారతాయి. అందుకే ప్రేక్షకుల నాడి ఏంటో తెలియక నిర్మాతలు, దర్శకులు ఒక్కోసారి సతమతం అవుతుంటారు. విభిన్న కథలతో సినిమాలు తీసినా, మిగిలిన అంశాలు బాగోక పోతే సినిమాకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఒకే కథను తిప్పి తిప్పి, కొంచెం కొంచెం మార్పులు చేసి సినిమాలు చేసేయడం మన టాలీవుడ్‌లో మనం చాలా చూశాం.

అయితే కొన్ని అదే స్పూర్తితో తీసిన సినిమాలకు మాత్రం ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సీనియర్ ఎన్టీఆర్ తీసిన ఓ సినిమా కథకు దగ్గర పోలికతో ఉండే సినిమా తీసి నాగార్జున హిట్ అందుకున్నారు. దానికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి. నాగార్జుల కెరీర్‌లో హలోబ్రదర్ సినిమా సూపర్ హిట్ చిత్రంగా చెప్పుకోవచ్చు. ట్విన్స్‌గా ద్విపాత్రాభినయం చేసిన నాగార్జున నటన ఆకట్టుకుంటుంది. సౌందర్య, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించారు. ఒకే సమయంలో ఒకేలా ప్రవర్తించడం సియామీ ట్విన్స్ లక్షణం. దానినే దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ అద్భుతంగా తెరకెక్కించారు.

అయితే సినిమా చిత్రీకరణ సమయంలో కూడా ఈ సినిమా అంతగా ఆడదు అనే అభిప్రాయాన్ని నాగార్జున పలుమార్లు చెప్పారని తెలుస్తోంది. అయితే తన కథపై నమ్మకంతో దర్శకుడు ఈవీవీ ఆ సినిమాను చక్కగా తెరకెక్కించారు. దీనికి ఓ బలమైన కారణం కూడా ఉంది. అగ్గిపిడుగు అనే సినిమాను సీనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. దానికి ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. దాని స్పూర్తితోనే ఈవీవీ ఈ సినిమాను తెరకెక్కించారు. నాగార్జునకు చెప్పుకోదగ్గ హిట్ చిత్రం అందించారు.

Share post:

Latest