సోము 2.O: బాబుపై ప్రేమ!

సోము వీర్రాజు..ఏపీ బీజేపీ అధ్యక్షుడు అనే సంగతి అందరికీ తెలిసిందే…పేరుకు బీజేపీ అధ్యక్షుడు అయినా సరే ఈయన పూర్తిగా జగన్ కు అనుకూలంగా నడిచే నాయకుడు అనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ శ్రేణులు..సోముపై ఎప్పుడు ఫైర్ అవుతూ ఉంటాయి…సోము..జగన్ మనిషి అని విమర్శిస్తూ ఉంటారు. ఆ విమర్శలకు తగ్గట్టుగానే సోము రాజకీయం ఉండేది…ఆయన ఎప్పుడు చంద్రబాబుపైనే విమర్శలు చేస్తారు తప్ప..జగన్ పై పెద్దగా విమర్శలు చేయరు.

పైగా జగన్ అధికారంలోకి వచ్చాక కూడా సోము..బాబుపైనే విమర్శలు చేస్తూ వచ్చారు. అలాగే జగన్ పేరు తీసి ఎప్పుడు విమర్శలు చేయరు..ఏదో ప్రభుత్వ పరంగానే విమర్శలు చేస్తూ వచ్చారు. ఇలా బాబుకు యాంటీగా ఉండే సోము వీర్రాజు వర్షన్ ఇప్పుడు ఒక్కసారిగా మారింది…ఈ మధ్య జగన్ పై డైరక్ట్ గానే విమర్శలు చేస్తున్నారు. సరే జగన్ ని విమర్శిస్తే విమర్శించారు..కానీ బాబుపై పొగడ్తల జల్లు కురిపించారు.

ఇటీవల జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతికి మద్ధతుగా బీజేపీ నేతలు పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే..ఈ పాదయాత్రలో సోము కూడా పాల్గొన్నారు. అయితే ఇదే క్రమంలో అమరావతి గురించి మాట్లాడుతూ…చంద్రబాబు దార్శనికుడు కూడా కాబట్టే..ఆ నాడు కేంద్రం రూ.8,500 కోట్లు అమరావతి కోసం ఇవ్వడానికి చూసిందని, జగన్ దార్శినికుడు కాదు కాబట్టే…ఇప్పుడు నిధులు ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు.

ఇంతకాలం కనబడని బాబు దార్శనికత…సోముకు ఇప్పుడెలా కనిపించింది…సడన్ గా జగన్ ని విమర్శిస్తూ…బాబుని ఎందుకు పొగడుతున్నారనేది క్లారిటీ రావడం లేదు.  అయితే ఏపీలో బీజేపీ ఎంత కష్టపడిన ఒక్క సీటు కూడా రాదనే సంగతి తెలిసిందే…జనసేనతో పొత్తు ఉన్నా ప్రయోజనం లేదు…కానీ టీడీపీతో పొత్తు ఉంటే బీజేపీ నాలుగైదు సీట్లు గెలుచుకోవచ్చు. అందుకే బీజేపీ…ఇప్పుడు బాబుని దగ్గద చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు బాబు ఎలాగో…బీజేపీకి ఎప్పుడు దగ్గరవుదామని చూస్తున్నారు. బాబుకు బీజీపీ అధిష్టానం దగ్గరవుతున్న నేపథ్యంలోనే సోము వర్షన్ మారిందని తెలుస్తోంది.

Share post:

Latest