అందాల సుంద‌రి శ్రీదేవి జీవితంలో ఇంత జ‌రిగిందా?

అతిలోకసుందరి అలనాటి నటి శ్రీదేవి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఒకప్పటి కుర్రకారుకి అందాల దేవత శ్రీదేవి. తరాలు మారినా తరగని అందం ఆమె సొంతం. కనుమరుగైనా ఇంకా కనులముందే మెదులుతున్న తారాసుందరి శ్రీదేవి. ఇక శ్రీదేవి గొప్పతనం గురించి తెలుసుకోవాలంటే వివాదాల దర్శకుడు RGV మాటలు వినాల్సిందే. ఆమె తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది. బాలనటిగా తన కెరీయర్ ను మొదలుపెట్టిన శ్రీదేవి ఆ తర్వాత భారతీయ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.

సీనియర్ ఎన్టీఆర్ ను మొదలుకొని నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ లాంటి హీరోల వరకు ప్రతి ఒక్కరితో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ సినిమా అనే పుస్తకంలో తనకంటూ ఓ పేజీని రాసుకుంది. సౌత్ ఇండియాతో పాటు అనేక భారతీయ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇకపోతే శ్రీదేవి సినిమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఆమె తల్లి దగ్గరుండి మరీ చూసుకునేదట. శ్రీదేవి జీవితంలో సంతోషమే లేదు అని ఇటీవల రమ ప్రభ ఓ మీడియా వేదికగా వెల్లడించారు. ఎంతలా అంటే కనీసం ఇష్టమైన ఐస్ క్రీమ్ తినడానికి కూడా తన తల్లి పర్మిషన్ తీసుకొనే పరిస్థితి ఉండేదట.

అంతలా ఆమె తన జీవితంలో అనేక రిస్ట్రిక్షన్స్ మధ్య గడిపారట. ఇకపోతే శ్రీదేవి వైవాహిక జీవితం విషయానికి వస్తే.. మొదట ఒక వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత అతడితో సరిగ్గా పొసగక విడాకులు తీసుకొని ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ను వివాహం చేసుకున్న విషయం విదితమే. వైవాహిక జీవితంలోనైనా సంతోషంగా ఉంది అంటే అది కూడా లేదనే చెప్పాలి. బోనీకపూర్ నుంచి ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కొందట . ఇక చివరికి బాత్ టబ్ లో శ్రీదేవి పడి మరణించాల్సిన పరిస్థితి గురించి అందరికీ తెలిసినదే. చాలామంది అదొక మిస్టరీగా చెప్పుకుంటారు.

Share post:

Latest