రేవంత్ రూటే సెపరేట్…!

తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉపఎన్నిక అంశం…ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు…రేపో మాపో స్పీకర్ కు రాజీనామా అందించి…ఆమోదింపజేసుకుని, బీజేపీలో చేరనున్నారు..దీంతో మునుగోడు స్థానానికి ఉపఎన్నిక రానుంది.

ఇక ఈ ఉపఎన్నికలో బీజేపీ తరుపున కోమటిరెడ్డి బరిలో దిగడం ఖాయం…అయితే మునుగోడులో బీజేపీకి ఏ మాత్రం బలం లేదు…కేవలం కోమటిరెడ్డి బలంపైనే ఆధారపడి ముందుకెళ్లాలి. అటు అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ పట్టు ఉంది..కాకపోతే అధికార పార్టీపై ప్రజల్లో కాస్త వ్యతిరేకత కూడా ఉంది. ఈ వ్యతిరేకతని దాటుకుని టీఆర్ఎస్ ఏ స్థాయి వరకు రాణిస్తుందో చూడాలి.

అయితే మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి బాగా పట్టు ఉందని చెప్పాలి..కాకపోతే కోమటిరెడ్డి లాంటి లీడర్ తర్వాత కాంగ్రెస్ లో అంత బలమైన నాయకుడు లేరు. దీంతో మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్తితులు ఉన్నాయి..ఈ పరిస్తితుల నుంచి పార్టీని బయటపడేసేందుకు టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఇప్పటికే రాజగోపాల్ రాజీనామా తర్వాత..దూకుడుగా ఉంటూ…మునుగోడులో వేల మందితో సభ పెట్టి…అక్కడ తమ సత్తా తగ్గలేదని నిరూపించారు.

అదే సమయంలో మునుగోడుపై కాస్త పట్టున్న తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చారు..ఈయనకే టికెట్ ఇవ్వొచ్చని ప్రచారం కూడా జరుగుతుంది. అదే సమయంలో మునుగోడులో కమ్యూనిస్టులకు పట్టు ఎక్కువే ఉంది. అందుకే తెలివిగా కమ్యూనిస్ట్ సోదరులు కలిసిరావాలని రేవంత్ పిలుపునిచ్చారు.

అటు రాజగోపాల్ అన్న…కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరి కూడా అనుమానంగానే ఉంది..ఆయన ఎప్పుడు రేవంత్ పైనే విమర్శలు చేస్తున్నారు…తాజాగా అమిత్ షా తో కూడా భేటీ అయ్యారు…ఈ నేపథ్యంలో ఆయన పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోవచ్చని ఇతర కాంగ్రెస్ నేతల చేత రేవంత్ చెప్పిస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో తాను అనుకున్నదే జరిగేలా రేవంత్ ప్లాన్ చేసుకుంటున్నారు..అలాగే మునుగోడులో అనుకూల పరిస్తితులు వచ్చేలా చేస్తున్నారు.

Share post:

Latest