అలాంటి చర్యలవలన నా జీవితం నాశనం అయ్యింది… తాగుడుకు బానిసయ్యా అంటున్న నటి!

సినిమా జీవితం అంటే సగటు ప్రేక్షకుడు ఊహించినంత అందంగా ఏమీ ఉండదు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఆర్టిస్టులు జీవితాన్ని గడుపుతూ వుంటారు. అందులోనూ యాక్ట్రెస్ గురించైతే చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. అయినా మంచి సినిమా ఛాన్సులు వారికి దొరికే అవకాశం ఉండదు. అన్నింటికీ తట్టుకున్నవారు ఏదోఒకలాగా నెట్టుకొచ్చేస్తారు కానీ, ఇలా ఉండాలి అనుకున్నవారు మాత్రం అనేక కష్టాలు ఇక్కడ చవిచూడాల్సి ఉంటుంది. గత కొన్నాళ్లుగా మీటు ఉద్యమం ద్వారా అనేకమంది మహిళా ఆర్టిస్టులు తన గళాన్ని వినిపించారు. ఈ కోవలోనే యంగ్ హీరోయిన్ తేజస్వి మదివాడ తాజాగా విస్తుపోయే విషయాలను చెప్పుకొచ్చింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లో కూడా సందడి చేసింది. కేరింత, మనం, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, పండగ చేసుకో లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు కూడా తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ లో కూడా పాల్గొని తన ప్రవర్తనతో కాస్త నెగెటివిటీ మూట కట్టుకుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో కనిస్టెంట్ గా పాల్గొన్న ఆమె.. రీసెంట్ గా కమిట్మెంట్ అనే సినిమాలో బోల్డ్ రోల్ పోషించి మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమా సంగతి ఎలా ఉన్నా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తేజస్వి చెప్పిన కొన్ని విషయాలు సెన్సేషన్ అవుతున్నాయి.

‘కౌశల్ ఆర్మీ’ కారణంగా తాను ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించానని చెబుతూ కొన్ని సంచలన విషయాలు తాజాగా బయటపెట్టింది తేజస్వి. బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఆమెకు కౌశల్ ఆర్మీ టార్చర్ చూపించారట. కౌశల్ ఆర్మీ గ్యాంగ్ కారణంగా తాను తీవ్రమైన మనోవేదనకు గురైనట్లు చెప్పుకొచ్చింది. కౌశల్‌ మండా ఆర్మీ తనను టార్గెట్ చేసి మరీ టార్చర్ చూపించారని చెప్పింది. బ్యాడ్ చేస్తూ ఎన్నో రకాలుగా అటాక్ చేశారని తెలిపింది. దాంతో కౌశల్ ఆర్మీ తీరుతో విసిగిపోయి ఇక సినిమాల్లో నటించకూడదని డిసైడ్ అయ్యానని, అయితే కమిట్మెంట్ కథ నచ్చడంతో మళ్ళీ కెమెరా ముందుకొచ్చా అని తేజస్వి చెప్పింది. బిగ్ బాస్ నుంచి బయటకొచ్చాక అప్సెట్ అయి తాగాల్సిన పరిస్థితి కూడా వచ్చిందని చెబుతూ ఓపెన్ అయింది.

Share post:

Latest