ఇలియానా సూసైడ్ అటెంప్ట్ అందుకే చేసిందా? కారణం అతడేనా?

తెలుగునాట ఇల్లు బేబీ అంటే ఎవరో తెలియని యువత ఇంచుమించుగా ఉండరనే చెప్పుకోవాలి. 14 ఏళ్ల కింద దేవదాస్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సెగలు పుట్టించింది ఈ గోవా సుందరి. ఇక ఆ తర్వాత మహేష్ బాబుకి జోడిగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పోకిరి సినిమాలో నటించి పోకిరి కుర్రాళ్లను సైతం అమ్మడు కిర్రెక్కించింది. ముఖ్యంగా ఆమె నడుము అందాలకు తెలుగు ప్రజలు ఫిదా అయిపోయారు. ఇక దర్శకులు కూడా ఆమె నడుముని కవర్ చేయడంలో నైపుణ్యం చూపించేవారు. ముఖ్యంగా తెలుగులో తొలి కోటి రూపాయల తారగా సంచలనం సృష్టించింది మన ఇల్లు బేబీ.

అలాంటి ఇలియానా ఆత్మహత్య చేసుకోవాలనుకుందా.. అని అనుకుంటున్నారా? ఎవరి జీవితాల్లో అయినా ఎత్తుపల్లాలు ఉంటాయి. అలా ఆనందంగా సాగిపోతున్న ఇలియానా జీవితం బాలీవుడ్ కి వెళ్లడంతో కాస్త నెమ్మదించింది అని చెప్పుకోవచ్చు. మొదట్లో ఒకటి అరా సినిమాలు ఆడినా తరువాత అమ్మడుకి అక్కడ అవకాశాలు అనేవి లేకుండా పోయాయి. ఓ దశలో అయితే ఆమె చచ్చిపోవాలని నిర్ణయించుకుంది. ఆ దిశగా ఓ విఫలయత్నం కూడా చేసింది ఇలియానా. అయితే దానికి కారణం ఆమె బాయ్ ఫ్రెండ్‌తో విడిపోవడమే అని ఆమె సన్నిహితులు చెబుతూ వుంటారు.

ఇకపోతే ఇల్లు బేబీ ఆస్ట్రేలియన్ ఫోటోగ్రఫర్ అయినటువంటి ఆండ్య్రూతో పీకల్లోతు ప్రేమలో పడిన సంగతి విదితమే. వీరు ఈ క్రమంలో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ జరగలేదు.. అలాంటి సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు సినిమాలు లేక.. మరోవైపు వ్యక్తిగత జీవితం గాడి తప్పడంతో చచ్చిపోవడమే నయమని నిర్ధారించుకుంది ఇలియానా. అందుకే ఓ రోజు ఏకంగా 12 పవర్ ఫుల్ నిద్రమాత్రలు కూడా మింగానని ఈ భామ ఓ మీడియా వేదికగా చెప్పుకొని బాధపడింది. కానీ భూమ్మీద నూకలు మిగలబట్టి ఇంకా బతికి వున్నానని ఎమోషనల్ అయింది.

Share post:

Latest