రాపాకకు సరైన ప్రత్యర్ధి?

ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి జంప్ చేసే నాయకులని ప్రజలు ఆదరించే రోజులు పోయాయి. గత ఎన్నికల్లోనే ఈ విషయం రుజువైంది..వైసీపీ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే…అలాగే కొందరు మంత్రులు కూడా అయ్యారు. అలా అనైతికంగా గెలిచి పార్టీలు మారిన వారిని ప్రజలు తిరస్కరించారు. రానున్న రోజుల్లో జంపింగులని ఆదరించమని ఆ ఎన్నికల్లోనే ప్రజలు రుజువు చేశారు.

అయితే వచ్చే ఎన్నికల్లో కూడా జంపింగులని ప్రజలు ఆదరించే పరిస్తితి కనిపించడం లేదు. టీడీపీ నుంచి గెలిచిన నలుగురు, జనసేన నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే వైసీపీ వైపుకు వెళ్లారు. కాకపోతే డైరక్ట్ పార్టీ కండువా కప్పుకోకుండా…ఆ పార్టీ ఎమ్మెల్యేలుగానే పనిచేస్తున్నారు. అంటే అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేలు గా ఉన్నారు. ఇలా లాజిక్ లతో రాజకీయం చేసిన ప్రజలు ఆదరించే పరిస్తితి లేదని చెప్పొచ్చు. వచ్చే ఎన్నికల్లో జంపింగ్ ఎమ్మెల్యేలని ప్రజలు తిరస్కరించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

ముఖ్యంగా జనసేన తరుపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ని ఈ సారి ప్రజలు ఆదరించేలా లేరు. వైసీపీ వైపుకు వెళ్ళిన ఈ రాజోలు ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది…అలాగే ఈ సారి రాపాకని ఓడించాలని కసితో జనసైనికులు పనిచేస్తున్నారు. అటు సొంత పార్టీల కూడా రాపాకపై వ్యతిరేకత ఉంది. నెక్స్ట్ గాని రాపాకకు వైసీపీ సీటు ఇస్తే రాజోలు సీటుపై ఆశలు వదిలేసుకోవచ్చు అనే పరిస్తితి.

ఇక రాపాకకు చెక్ పెట్టాలని చెప్పి…పవన్ సైతం రాజోలులో ఈ సారి మంచి అభ్యర్ధిని నిలబెట్టాలని చూస్తున్నారు. ఆ మధ్య జనసేనలో చేరిన రిటైర్డ్ ఐ‌ఏ‌ఎస్ ఆఫీసర్ దేవ వరప్రసాద్ ని రాజోలు బరిలో నిలబెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే బరిలో ఎవరిని నిలబెట్టిన గెలిపించుకోవాలని జనసేన శ్రేణులు చూస్తున్నాయి. అదే సమయంలో టీడీపీతో పొత్తు ఉంటే డౌట్ లేకుండా రాజోలులో జనసేన గెలవడం ఖాయమే.

Share post:

Latest