గ్లామర్ ఒలకబోస్తున్న రాజశేఖర్ కుమార్తె.. ఫొటోలు వైరల్

అంకుశం, మా అన్నయ్య, సింహరాశి వంటి సినిమాలతో ప్రేక్షకుల హృదయాలలో హీరో రాజశేఖర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తన భార్య జీవితతో కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. వారి నటనా వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ, వారి కుమార్తెలు సినీ రంగ ప్రస్థానం మొదలు పెట్టారు. పెద్ద కుమార్తె శివాని అందాల పోటీలలో పాల్గొనడంతో పాటు వైద్య విద్యను అభ్యసిస్తోంది. మరో వైపు వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తోంది. ఇక ఆమె చెల్లి శివాత్మిక కూడా తల్లిదండ్రులు, అక్క బాటలోనే నడుస్తోంది. ఆమె డెబ్యూ మూవీ ‘దొరసాని’లో నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఆ తర్వాత ఆమె రూటు మార్చింది. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో శివాత్మిక పోస్ట్ చేస్తున్న ఫొటోలు హాట్ హాట్‌గా దర్శనమిస్తున్నాయి. తాను కూడా గ్లామర్ పాత్రలు చేసేందుకు సిద్ధమనే సంకేతాలను ఆమె పంపుతోంది. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలలో ఆమె నటిస్తోంది. జీ5లో ప్రసారం కానున్న వెబ్ సిరీస్ అహనా పెళ్లంంట, కృష్ణ వంశీ దర్శకత్వంలో రానున్న రంగమార్తాండం సినిమాలోనూ ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది.

అంతేకాకుండా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న పంచతంత్రం సినిమాతో పాటు, ఆకాశం అనే సినిమాలోనూ హీరోయిన్‌గా ఆమె చేస్తోంది. దీంతో పాటు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటోంది. హాట్ హాట్ ఫొటో షూట్‌లతో ప్రముఖ హీరోయిన్లకు తానేమీ తక్కువ కాదనే సందేశాన్నిస్తోంది. నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలతో పాటు గ్లామర్ సినిమాలు కూడా దక్కించుకునేందుకు ఆమె ఈ ఫొటో షూట్లు చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Share post:

Latest