కన్నీళ్లు తెప్పిస్తున్న పూరి కూతురు ఎమోషనల్ పోస్ట్.. ఎంత బాధపడుతుందో..!?

ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తుంది. అదే లైగర్. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అయిన లైగర్ మూవీ… ఇప్పుడు నెగిటివ్ టాక్ తో ట్రెండ్ అవుతుంది.
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన మూవీ నే ఈ లైగర్. గత కొంతకాలంగా ఒక్క హిట్టు కోసం ట్రై చేస్తున్న పూరీ జగన్నాథ్.. ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకొని ఉన్నారు. అంతేకాదు ఈ సినిమాకు పూరి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ సినిమా హిట్ అవ్వడం ఆయన కెరీర్ కు చాలా ముఖ్యంగా సినీ విశ్లేషకులు భావించారు. కానీ అనుకోని విధంగా లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మొదటి షో తోనే భారీ డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.

దీంతో పలువురు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ పూరీ జగన్నాధ్..ని ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ని కూడా భారీ స్దాయిలో ట్రోలింగ్ లో ముంచెత్తుతున్నారు. ఓ నెటిజన్ అయితే..చెత్త సినిమాకు పోయి ఇన్ని డేస్ ప్రమోషన్స్ చేశారా..? గతంలో పోకిరి సినిమా తీసింది నువ్వే నా పూరి..? అంటూ కామెంట్స్ చేస్తూ పూరి జగన్నాథ్ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు కొందరు నెటిజన్స్ సినిమా రిలీజ్ అయ్యే ముందు పూరి జగన్నాథ్ కూతురు పవిత్ర పెట్టిన పోస్ట్ ను కూడా మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు.

పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన మొదటి పాన్ ఇండియా సినిమా లైగర్ నే. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులు మొదటి షో తోనే నిరాశ పరిచారు .సినిమాలో విజయ్ దేవరకొండ పర్ఫామెన్స్ పరంగా మెప్పించాడని డైరెక్షన్ పరంగా పూరి జగన్నాథ్ ఫ్లాప్ అయ్యాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా సినిమా రిలీజ్ కొద్దిసేపటి ముందు పూరి జగన్నాథ్ కూతురు పవిత్ర సోషల్ మీడియా వేదికగా తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

అందులో ఆమె రాసుకొస్తూ..” మై ఫరెవర్.. మై లైఫ్..నాన్న, నేను ఇంత నెర్వస్ గా ఎప్పుడూ లేను. లైగర్ సినిమా కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో మాకు తెలుసు. కచ్చితంగా నీ కష్టానికి తగ్గ ఫలితం
అందుతుంది. ఏ విషయంలోను భయపడకూడదు అని.. జీవితంలో రిస్క్ తీసుకోవడానికి అస్సలు భయపడకూడదు అనే విషయాలు నేను నీ నుండే స్ఫూర్తిగా తీసుకున్నాను . సినిమా కోసం మొత్తం టీం ఎంత కష్టపడ్డారు నాకు తెలుసు. టీమ్ అందరికీ ముందుగానే కంగ్రాట్స్. నీ ఆనందంలో నేను పక్కన లేకపోవచ్చు.. కానీ, నువ్వు డైరెక్ట్ చేసిన సినిమా చూస్తూ ఆనందంగా నేను విజిల్స్ వేస్తాను. ఒక విషయం గుర్తు పెట్టుకో నాన్న.. నిన్ను చూసి మేము చాలా గర్వపడుతుంటాము. నిన్ను హోల్డ్ చేయడానికి వెయిట్ చేయలేకపోతున్నాను.. డాడీ ఐ లవ్ యు సో మచ్” అంటూ రాసుకొచ్చింది. దీంతో కొందరు నెటిజన్స్ పవిత్ర పోస్ట్ ను వైరల్ గా చేశారు . సినిమా పై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న పవిత్ర ఇంత నెగటివ్ టాక్ ని ఎలా తట్టుకుంటుందో..? ఎంత బాధ పడుతూ ఉంటుందో..? పూరి నువ్వు అభిమానుల ఆశలనే కాదు.. నీ బిడ్డ ఆశలను కూడా నిరాశపరిచావు.. నువ్వు డైరెక్టర్ గా ఫేడ్ అవుట్ అయిపోయావు..” అంటూ హ్యూజ్ ట్రోలింగ్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Pavithra Puri (@pavithrapuri_)

Share post:

Latest