ఇంట్రెస్టింగ్: ఆ అక్షరం పూరి జగన్నాధ్ పాలిట శాపంగా మారిందా..?

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెరీర్ మొదట్లో వచ్చిన సినిమాలు అని సూపర్ సక్సెస్ సాధించాయి. వరుస హిట్లతో దూసుకుపోయాడు. స్టార్ హీరోలు అందరూ పూరి డైరెక్షన్లో ఒక్క సినిమా చేయాల‌ని కోరుకోవ‌డంతో
పూరీ రేంజ్ పెరిగిపోయింది. ఇదే క్రమంలో పోకిరి- దేశముదురు సినిమాలు పూరిని మరో లెవెల్ కు తీసుకుపోయాయి. అంతమంది దర్శకులు ఉన్నా చిరంజీవి… రామ్ చరణ్‌ను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఇది చూస్తేనే పూరి రేంజ్ ఏంటో మనకు అర్థమవుతుంది.

Bollywood waiting for Puri Jagannadh

గత కొన్నాళ్లగా పూరి జగన్నాథ్ చేసే సినిమాలు హిట్ సాధించలేకపోతున్నాయి. పూరి డైరెక్షన్‌లో ఎప్పుడో వచ్చిన బిజినెస్ మాన్ – టెంపర్ – ఇస్మార్ట్ శంకర్ మాత్రమే హిట్ సినిమాలుగా నిలిచాయి. తాజాగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా వచ్చిన సినిమా లైగర్. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన అంచనాలను అందుకోలేదు. పూరి కెరీర్ వీక్ సినిమాలో ఈ సినిమా ఒకటిని కామెంట్లు వస్తున్నాయి.

Puri Jagannadh's LIGER Story Leaked On Social Media?

ఈ క్రమంలో పూరి సినిమాలపై ఓ వార్త‌ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. పూరికి ల అక్షరం అచ్చు రాలేదని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోకి వచ్చిన సినిమా లోఫర్. తాజాగా వచ్చిన సినిమా లైగ‌ర్. ఈ రెండు సినిమాలు ఒక సినిమాను మించిన‌ మరొకటి ప్లాప్‌ రిజల్ట్ అందుకోవటం గమనారం. ల అక్షరంతో సినిమా పేర్ల‌కు పూరీ జగన్నాథ్ దూరంగా ఉండాలని మరికొందరు సూచనలు చేస్తున్నారు.

tvRights@urFingerTips : Loafer Movie Satellite Rights

లైగర్ – లోఫర్ సినిమాల చివరి పదాలు కూడా ఒకటే అయినా చివరి పాదం ర ఉన్న పూరి జగన్నాథ్ సినిమాల్లో చాలా సినిమాలు హిట్ అయ్యాయి. ఇక పూరి జగన్నాథ్ మారాల్సిన సమయం వచ్చిందని కొత్త కథాంశాలతో సినిమాలు తీయాలని. రొటీన్ కథలు మాని ప్రేక్షకుల నేటివిటీకి తగ్గట్టు సినిమాలు తీయాలని పూరి జగన్నాథ్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Share post:

Latest