అల్లు అర్జున్ పై ఊహించని కామెంట్స్ చేసిన ప్రముఖ నటుడు..!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తన నటనతో ఎంతో మంది అభిమానులను మార్చుకున్న అల్లు అర్జున్ బాలీవుడ్ లో ప్రమోషన్స్ చేయకుండానే పుష్ప సినిమాతో బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు అంటే ఇక ఆయనకు దేశవ్యాప్తంగా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఇటీవల అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ హీరోగా మారిపోయారు.

ఇకపోతే ఈ కాంబినేషన్లోనే తెరకెక్కిన ఆర్య సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కాగా ఆర్య 2 సినిమా యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఇక మళ్లీ అదే కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ది రైస్ సినిమాతో బన్నీ, సుకుమార్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ కూడా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. ఇకపోతే యాక్టర్ అజయ్ ఘోష్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా ఆయన వెల్లడించారు. ఇక ఆయన మాట్లాడుతూ రంగస్థలం ఒక ఎత్తు అయితే పుష్ప మరొక ఎత్తు అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా సుకుమార్ ఫోన్ చేసి ఆడిషన్ తీసుకొని రంగస్థలంలో ఎంపిక చేశారు అని అజయ్ ఘోష్ వెల్లడించారు.

ఇక ఆయన మాట్లాడుతూ.. నాకు జనంతో మమేకం కావడం ఇష్టమని , ఇక నా లైఫ్ లో పుష్పా సినిమా గురించి ఒక పుస్తకం కూడా రాయవచ్చని ఆయన తెలిపారు. ఇక కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత చాలా టెన్షన్ పడి పుష్ప షూటింగ్లో పాల్గొన్నారు అని తెలిపిన ఆయన, సుకుమార్ గారు అరగంట మాట్లాడి పుష్ప సినిమాలో నటించకూడదనుకున్న నా నిర్ణయాన్ని మార్చారు అంటూ వెల్లడించారు . ఇక బన్నీ తో చేయాలంటే మొదట భయం వేసింది. కానీ బన్నీ నన్ను చూసి తనలో తాను నవ్వుకుంటూ సినిమాను చేయనన్నారు అంట కదా అంటూ అన్నాడని విజయ ఘోష్ కామెంట్లు చేశారు.

అల్లు అర్జున్ గొప్ప గుణం కలవాడు.. ఇక ఆ గుణం ఏమిటి అంటే బాగా నటిస్తే మంచి ఆర్టిస్ట్ తో నటిస్తున్నానని చెబుతూ మెచ్చుకుంటారని ఆయన వెల్లడించారు. ఇక బన్నీ చాలా గొప్పవాడు అంటూ తెలిపాడు.

Share post:

Latest