పవన్ భార్య.. రేణూ దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!

సోషల్ మీడియాలో హీరోయిన్ రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండేది…కానీ ఈ మధ్యకాలంలో అంతగా ఫాలోవర్స్ కు టచ్ లో లేదు పైగా కరోనా ఫస్ట్ సెకండ్ వేవ్ సమయంలో ఎంతోమందికి సహాయం కూడా చేసింది. అయితే కరోనా తర్డ్ వేవ్ లో మాత్రం ఆమె కూడా కరోనా బారిన పడడంతో ఇంటి నుండి బయటకు కూడా రాలేదు. కరోనా సమయంలో కూడా రేణూ దేశాయ్ కొన్ని షూటింగులు కూడా చేసింది ఆ తర్వాత కరోనా ఎక్కువ అవుతూ ఉండడంతో షూటింగులు మానివేసింది. ఇక ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా దూరంగా ఉంటూ వచ్చింది రేణూ దేశాయ్.రేణు దేశాయ్ ఫొటోస్ - 10TV Teluguఇక గత కొద్ది రోజుల క్రితం అకిరానందన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని ఫోటోలను మాత్రమే షేర్ చేసింది అందులో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నాడు. ఆ తరువాత రేణు దేశాయ్ తన పిల్లలను తీసుకొని ఫారిన్ ట్రిప్ కు వెళ్ళిపోయింది. స్కాట్లాండ్లో అకిరా ఆద్య రేణు దేశాయ్ చెక్కర్లు కొడుతూ ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి. ఇక అంతే కాకుండా ఆద్య చేస్తున్న అల్లరిని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది రేణూ దేశాయ్.రేణూ దేశాయ్ ఎప్పుడూ కూడా తన కుటుంబం గురించే కాకుండా సామాజిక అంశాల పైన కూడా ఎక్కువగా స్పందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెట్లు, అడవులు, రోడ్లు, ప్రకృతి అంటూ కూడా ఇలా ప్రతి ఒక్క అంశం పైన స్పందిస్తూ ఉంటుంది.రేణూ దేశాయ్ పూర్తిగా వేగాన్ గా మారిపోయింది. అంటే పాలు పాల పదార్థాలు కూడా ముట్టరని అర్థము.. జంతువుల నుంచి వచ్చిన ఏ పదార్థము వాటిని హింసించి తీసుకొనే వాటిని కూడా తను తినదన్నమాట. పాలు పాల పదార్థాలు.. వాటిని ఉపయోగించిన కూడా మనం ఆవులు,గేదెలను చంపినట్టే అని తనకు అర్థమైందని తెలియజేసింది. అంతేకాకుండా నెయ్యి వెన్న వంటి పదార్థాలను కూడా మానేయడం చాలా కష్టమని కానీ పాల పరిశ్రమ అంత దారుణంగా మారిపోయింది మరొకటి ఉండదు అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Share post:

Latest