పవన్ అభిమానులారా కాలర్ ఎగరేయండి… పవర్ ప్యాక్ట్ మాసివ్ అప్డేట్ వ‌చ్చేసింది..!

తెలుగు చిత్రపరిశ్ర‌మ‌లో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అంతా కాదు. సినిమాలు హిట్‌, ప్లాప్‌ల‌తో సంబంధం లేకుండా ప‌వ‌న్‌ సినిమాలు కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. ఈ ఏడాది మొదట్లో భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకొచ్చి అఖండమైన విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస‌ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పీరియాడికల్ సినిమా హరిహర వీరమల్లు షూటింగ్లో బిజీగా ఉన్నాడు.

Hari Hara Veera Mallu to resume soon!

ఈ సినిమా షూటింగ్ చివర దశలోకి వచ్చింది. అయితే షూటింగ్ ప్రారంభమై చాలా నెలలు గడుస్తున్నా ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ బయటికి రాలేదు. దీంతో అభిమానులు ఈ సినిమా మేకర్స్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేస్తున్నట్లు ఒక వార్త బయటకు వచ్చింది. దీంతోపాటు ఈ గ్లింప్స్‌కు వీడియోకు స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు కూడా టాక్.

ఈ వార్త బయటకు రావ‌టంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందానికి హద్దులు లేవు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తర్కెక్కుతున్న ఈ సినిమా వచ్చే సమ్మర్ లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ చెప్తున్నారు. ఈ సినిమాలో పవన్ కి జోడిగా నిధి అగర్వాల్, నర్గిన్ ఫక్రి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ. దయాకర్ రావు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

Share post:

Latest