ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నాను రా బాబు అని బాధపడ్డ ఎన్టీఆర్..!?

జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరుకు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన చరిత్ర ఉంది. యంగ్ హీరోగా సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఈ హీరో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తీస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ సపరేట్ స్థానాన్ని సంపాదించుకున్నాడు. నటనలో రూపంలో తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీలో నందమూరి అభిమానులను ఉత్సాహపరుస్తున్న తారక్ అంటే జనాల్లో పిచ్చ క్రేజ్ ఉంది. సినిమాలు ఏ హీరో అయినా తీస్తాడు నాన్న పేరు చెప్పుకొని తాత పేరు చెప్పుకొని ఇండస్ట్రీ లోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ, జూనియర్ ఎన్టీఆర్ లా అభిమానుల కోసం సినిమాలు తీసేవాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. జనాలుకు నచ్చేలా జనాలు మెచ్చేలా ఈ యంగ్ టైగర్ సినిమాలు తీస్తాడు.

Did you know Jr NTR wrapped up 'Komaram Bheemudo' song from 'RRR' in 15 days? | Telugu Movie News - Times of India
రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు ను తన ఖాతాలో వేసుకున్న తారక్ ప్రజెంట్ డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ సినిమాకు కమిట్ అయి ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పతికే స్టార్ట్ అవ్వాలి..కానీ పలు కారణాలు చేత వాయిదా పడుతూనే వస్తుంది. ఇదిగో సినిమా స్టార్ట్ అవుతుంది ఇదిగో రేపు అంటూ సినిమా షూటింగ్ ను కొరటాల శివ లేట్ చేసుకుంటూ పోతున్నారు. ఈ సినిమా అయిపోగానే తారక్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరో పాన్ ఇండియా సినిమాకు ఫిక్స్ అయ్యాడు , ఈ రెండు సినిమాల పై అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకోని ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రశాంత్ నీల్ తో సినిమాపై ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు.

Andhrawala telugu | Sun NXT

అయితే, తారక్ ఇప్పటి వరకు తాను చేసిన సినిమాల్లో నచ్చని సినిమా ఏదైన ఉంది అంటే..అది ఆంధ్రావాలా సినిమానేనట. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఆంధ్రావాలా సినిమా అంటే జనాలకి ఒక రకమైన కోపం. ఎందుకంటే అప్పటివరకు సాఫీగా సాగిపోతున్న తారక్ కెరియర్ కు బిగ్గెస్ట్ మైనస్ గా నిలిచింది. ఈ సినిమాని చూసిన తరువాత ఈ సినిమాను తారక్ ఎలా ఒప్పుకున్నాడా అంటూ ఇప్పటికి అభిమానులు ప్రశ్నిస్తున్నారు, అంతెందుకు ఈ సినిమా తారక్ రేంజ్ సినిమా కాదు అని పూరి జగన్నాథ్ నే ఒప్పుకున్నాడు. తారక్ కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా చేయకుండా ఉంటే బాగుండేదని.. ఈ సినిమా చేసి తప్పు చేశాను అన్నట్లు చెప్పుకొచ్చాడట. తారక్ కెరీర్ లోణే ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.NTR Preaches Road Safety, But Doesn't Follow: Puri