క‌ళ్యాణ్‌రామ్ రిక్వెస్ట్‌కు నో చెప్పేసిన ఎన్టీఆర్‌…!

నందమూరి హీరోల్లో ఒక‌డు అయిన‌ కళ్యాణ్ రామ్ చాలా వైవిధ్యమైన నటుడు. క‌ళ్యాణ్ సినిమాలు వైవిధ్యంగా ఉంటాయి. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ప్రెస్టేజ్‌గా సినిమాలు నిర్మిస్తున్నారు. ఇదే క్రమంలో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను మల్లిడి వశిష్ట్ రెడ్డి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. ఈ సినిమాల కేథరిన్ థెస్రా, సంయుక్త‌మీన‌న్ హీరోయిన్ల నటిస్తే కీరవాణి సంగీతం అందించారు. ఇప్పటికే బయటకు వచ్చిన‌ ఈ సినిమా ట్రైలర్- టీజర్ -పాటలు అదిరిపోయే హైప్‌ని క్రియేట్ చేశాయి.

- Advertisement -

ఈ సినిమా యూనిట్ జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వ‌హిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేయమని కళ్యాణ్ రామ్ అడిగాడట. ఎన్టీఆర్ నటిస్తే ఈ సినిమాపై మరింత హైప్ వస్తుందని అనుకున్నారంట. ఓ సందర్భంలో ఈ గెస్ట్ రోల్ గురించి ఎన్టీఆర్‌ను అడగగా ఆయన నో చెప్పారట. ఈ సినిమా ప్రమోషన్ వరకు అయితే ఓకే కానీ… ప్రేక్షకుల అటెన్షన్, పబ్లిసిటీ కోసం తనకు నటించడం ఇష్టం లేదని ఎన్టీఆర్ చెప్పాడట.

ఇప్పుడు బింబిసార రిలీజ్ వేళ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏదేమైనా ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేసి ఉంటే అభిమానులకు ఇది పండగే పండగ. ఈ సినిమాను రు. 37 కోట్లు బడ్జెట్ తో కళ్యాణ్‌రామ్ నిర్మించారు. ఇదిక‌ళ్యాణ్ రామ్ సినిమాల‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా నిలవనుంది. ఎన్టీఆర్ సైతం ఈ సినిమా చూసి చాలా బాగుందని రివ్యూ కూడా చెప్పడంతో… ఈ సినిమాపై అభిమానుల్లో, ట్రేడ్ వ‌ర్గాల్లో భారీ హైప్‌ కూడా క్రియేట్అ యింది.

Share post:

Popular