ఓంకార్ పై విరుచుకుపడుతున్న నెటిజన్స్..కారణం..?

ప్రముఖ నిర్మాత, యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలను అలరించడంలో ఓంకార్ ముందుంటారు . ఇక ఓంకార్ గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాలి అంటే బుల్లితెరకు కమర్షియల్ హంగులు దిద్దిన వ్యక్తి ఓంకార్ అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఆట అనే డాన్స్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడో అందరికీ తెలిసిందే. ఇక ఆ స్థాయి విజయాలను మళ్ళీ ఆయన ఎన్నో అందుకోవడం జరిగింది.యాంకర్ ఓంకార్‌కు కరోనావైరస్.. క్లారిటీ ఇచ్చిన కుటుంబ సభ్యులు | Anchor and  director Omkar tested coronavirus negative - Telugu Filmibeatబుల్లితెరపై సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతున్న ఓంకార్ ఈ సమయంలోనే ఈ టీవీ ప్రేక్షకులు ముఖ్యంగా జబర్దస్త్ అభిమానుల చేత చివాట్లు పడడం చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. అంతేకాదు ఒకప్పుడు ఓంకార్ ను పొగిడిన వారే ఇప్పుడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తున్నారు. కేవలం జబర్దస్త్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రస్తుతం జబర్దస్త్ లో ఉన్న కమెడియన్స్ కూడా ఓంకార్ అన్నయ్యను నానా మాటలు అంటున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే జబర్దస్త్ ఈ స్థాయి పతనానికి కారణం ఓంకార్ అనీ ప్రతి ఒక్కరు కూడా చెబుతూ ఉండడం గమనార్హం.

గతంలో ఓంకార్ కాకుండా వేరే ఛానల్ లో అదే జీ తెలుగు ఛానల్లో కామెడీ కార్యక్రమం ప్రేక్షకుల ముందు వచ్చింది .ఆ కార్యక్రమం జబర్దస్త్ కార్యక్రమాన్ని బీట్ చేయడంలో విఫలం అయింది. అందుకే జీ తెలుగు ఛానల్ వాళ్ళు ఆ కార్యక్రమాన్ని ఆపివేశారు. ఇప్పుడు స్టార్ మా వాళ్ళు కామెడీ స్టార్స్ పేరుతో తెగ హడావిడి చేస్తున్నారు .అయితే ఆ కామెడీ స్టార్స్ ని ఓంకార్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే మల్లెమాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ ఎత్తున ఈ కామెడీ కార్యక్రమాన్ని నిర్వహించడంతో జబర్దస్త్ రేటింగ్ పడిపోయిందని ఇలా జబర్దస్త్ రేటింగ్ పడిపోవడానికి కారణం ఓంకార్ అని తెగ కామెంట్లు చేస్తున్నారు.

ముఖ్యంగా డబ్బు ఆశ చూపించి జబర్దస్త్ స్టార్ కమెడియన్లను తన షోలోకి తీసుకుంటూ ఉండడం పై అటు కంటెస్టెంట్లు, ఇటు ప్రేక్షకులు అందరూ ఓంకార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ఓంకార్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Share post:

Latest