టాలీవుడ్ స్టార్ హీరోకు త‌న రేటుతో దిమ్మ తిరిగి బొమ్మ క‌న‌ప‌డే షాక్ ఇచ్చిన న‌య‌న్‌…!

2005 లో వచ్చిన ‘అయ్యా’ సినిమాతో నయనతార సౌత్ సిని ప‌రిశ్ర‌మ‌కు పరిచయం అయ్యారు. మొద‌టి సినిమానే భారీ సక్సెస్‌ కావడంతో.. స్టార్ హీరోల సినిమ‌లో నటించే అవకాశం వచ్చింది. త‌ర్వాత వ‌రుస సినిమా ఆఫర్ లతో.. సౌత్ సినిమా ప‌రిశ్ర‌మ‌లో అగ్ర హీరోయిన్‌గా మారిపోయింది ఈ బ్యూటి. వరుస విజయాలతో నయనతారకు కెరీర్ పరంగా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. అయితే నిజ జీవితంలో మాత్రం ఎదురుదెబ్బలు తగిలాయి. శింబు, ప్రభుదేవాలతో ప్రేమలో పడిన నయన్.. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ సమయంలో చాలా డిప్రెషన్‌కు గురయ్యారు. ఇక ఈమె సినీ కెరీర్ ముగిసిందనుకున్న తరుణంలో ‘రాజారాణి’ సినిమాతో మళ్లీ గాడిలో పడ్డారు. ఓ వైపు గ్లామర్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి సౌత్ లేడి సూపర్ స్టార్ అయ్యారు.

Nayanthara's hot and happening pictures with Vouge India | IWMBuzz

ఇక అదే క్రమంలో నయనతార తన సిని కెరియర్ మొదలుపెట్టి 20 ఏళ్లు దాటుతున్న సౌత్ సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతూవస్తుంది. నయనతార తాజాగా దర్శకుడు విగ్నేష్ శివన్‌నుప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లయిన తర్వాత కూడా నయనతార తన జోరుని అమాంతం పెంచేసింది. వరుస‌ సినిమాలతో సౌత్ సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ఆమె తన కెరియ‌ర్‌లో ఇప్పటివరకు 75 సినిమా సినిమాలలో నటించింది. అదే క్రమంలో నయనతార తన రెమ్యూనరేషన్ కూడా విపరీతంగా పెంచేసిన్నట్లు తెలుస్తుంది. మొన్నటి వరకు 3 కోట్లు అని వినిపించింది.

Just-Married Couple, Nayanthara And Vignesh Shivan Meet The Media, Former  Radiates Bridal Glow

అదే సందర్భంలో టాలీవుడ్ లో నితిన్ హీరోగా వచ్చిన మ్యాస్ట్రో లో నయన్ ని హీరోయిన్ గా తీసుకుందాం అనుకున్నారు. ఆ టైంలో నయన్‌ చెప్పిన రెమ్యూనరేషన్ కు నిర్మాతలు కళ్ళు చెదిరాయి. ఆ సినిమాలో నయన్ క్యారెక్టర్ ని తమన్నాతో చేపించారు మేకర్స్. ఇదే క్రమంలో ఇటీవల తెలుగులో ఓ సీనియర్ హీరో పక్కన నటించేందుకు న‌య‌న్‌ను తీసుకుందాం అనుకున్నారట. అప్పుడు నయనతార చెప్పిన రేటు చూసి నిర్మాతలు షాక్ అయ్యారట.ఆమె సింపుల్ గా 7కోట్లు డిమాండ్ చేసిందంట. ఇక అదే క్రమంలో రోజుకు లక్ష వంతెన తన టీం ఖర్చులను భరించాలని కూడా అడిగిందట. ఆమె షూటింగ్ ఏకంగా 50 రోజులు టైం పడుతుంది. అంటే 50 లక్షల ఎక్స్ట్రా ఇవ్వాలి అనమాట. ఇలా చెప్పిన న‌య‌న్ రెమ్యూనరేషన్ చూసి ఇప్పుడున్న నిర్మాతలు నయనతార తో సినిమా చేయాలంటే భయపడుతున్నారు. న‌య‌న్‌ చెప్పిన రేటుకు ఇంకా ఆమె తెలుగు సినిమాలో నటించడం కష్టమే అనే మాట వినిపిస్తుంది.