నాని మాస్ ధ‌మాకా ‘ ద‌స‌రా ‘ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది.. ఈ సారైనా హిట్ కొట్టేనా..!

తెలుగు చిత్ర పరిశ్రమలో నేచురల్ స్టార్ నాని మీడియం రేంజ్ హీరోల్లో టాప్ హీరోగా కొనసాగుతూ వస్తున్నారు. ఆయన చేసే సినిమాలు మినిమం హిట్ అనే టాక్ ఉంది. గత కొంతకాలంగా నానికి సరైన హిట్ లేదు. ఎప్పుడో తీసిన ఎంసీఏ ఆయనకి చెప్పుకోతగ్గ‌ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు నాని రేంజ్‌ను నిలబెట్టలేకపోయాయి. క‌రోనా తర్వాత వచ్చిన శ్యామ్ సింగ్ రాయ్ మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. దీని తర్వాత వచ్చిన అంటే సుందరానికి యావరేజ్.

Nani's Dasara has an Intense Love Story

ఇప్పుడు నాని కాస్త ఊర‌ మాస్ లుక్‌లోకి మారిపోయి దసరా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల‌ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ నానీ లుక్ కూడా పచ్చి మాస్‌గా అనిపించాయి. తాజాగా కొత్త పోస్టర్‌తో ఈ సినిమా రిలీజ్ డేట్ చెప్పేశారు. ఈ సినిమా వచ్చేది వ‌చ్చే యేడాది మార్చి 30 అని క్లారిటీ వ‌చ్చేసింది.

ఈ పోస్టర్‌లో అయితే నాని సూపర్ మాస్ గా డి గ్లామరైజ్ గా ఉన్నారు. దీంతో తన రోల్ విషయంలో అందరిలో మరింత ఆసక్తి రేకెత్తించాడు. ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ నటిస్తుంది. సంతోష్ నారాయణ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. గ‌త కొంత కాలంగా త‌న రేంజ్‌కు త‌గ్గ హిట్ లేని నాని ఈ సినిమాతో అయినా హిట్ కొడ‌తాడేమో ? చూడాలి.

Share post:

Latest