నంద‌మూరి హీరోల‌కు ఆగ‌స్టు భ‌లే క‌లిసొస్తుందే… ఫ్రూప్ ఇదిగో…!

నందమూరి కుటుంబానికి రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా నందమూరి కుటుంబానికి మూల స్తంభం అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావును మొదలుకొని నేటి వారి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ వరకు ఇలా ఎంతోమంది హీరోలు తమ కుటుంబం నుంచి వచ్చి ప్రేక్షకులను అలరించారు. కేవలం వినోదపరితంగా మాత్రమే కాకుండా కష్టం వస్తే ఆదుకోవడంలో కూడా ఈ కుటుంబం ముందు ఉంటుంది అని నిరూపించారు కూడా.. ఇదిలా ఉండగా మొన్నటి వరకు ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి మరణించడంతో ఆగస్టు నెల వీరికి కలిసి రాలేదు అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఇటీవల బింబిసారా సినిమా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆగస్టు నెల నందమూరి కుటుంబీకులకు భలే కలిసి వచ్చింది అంటూ వార్తలు స్ప్రెడ్ చేస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇందులో ఉన్న అసలు విషయం ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.Nandamuri family heading for a split?నిజానికి నందమూరి కుటుంబాల వ్యక్తిగత విషయంలో ఆగస్టు నెల పూర్తిగా బ్యాడ్ సెంటిమెంటుతో నిండిపోయింది. కానీ సినిమాల పరంగా ప్రేక్షకులను అలరించడంలో పూర్తిస్థాయిలో వారికి సెంటిమెంట్ గా మారింది . మరి సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు వచ్చిన హీరోల అందరి సినిమాలు ఆగస్టులో విడుదల అవ్వగా అందులో కొన్ని బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక అసలు విషయంలోకి వెళితే సీనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరియర్ లో మొత్తం 295 చిత్రాలలో నటించగా.. అందులో 28 సినిమాలు ఆగస్టు నెలలోనే విడుదలయ్యాయి. అందులో 19 సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటే మిగిలిన సినిమాలు అంచనాలను అందుకోలేకపోవడం గమనార్హం.Confirmed: Nandamuri Balakrishna to play father NTR in the upcoming biopic  - Movies News

ఇక తర్వాత బాలకృష్ణ నటించిన దేశోద్ధారకుడు సినిమా కూడా ఆగస్టులో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

నందమూరి హరికృష్ణ హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో సీతయ్య సినిమా కూడా ఆగస్టు నెలలో విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా యమదొంగ సినిమాను ఆగస్టు నెలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేసిందో మనం చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక ఇదే నెలలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారా సినిమాను ఆగస్టు 5వ తేదీన విడుదల చేయగా.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా కోట్ల రూపాయల కలెక్షన్ రాబడుతూ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఆగస్టు నెల సినిమాల పరంగా నందమూరి హీరోలకు బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.

Share post:

Latest