వారెవ్వా..ఆ విషయంలో నాగ్ ను ఢీ కొట్టే మగాడే ఇండస్ట్రీలో లేడుగా..రేర్ రికార్డ్..!!

సీనియర్ హీరో నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన నాగార్జున తండ్రికి తగ్గ తనయుడిగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. నాగార్జునను టాలీవుడ్ మన్మధుడుగా అందరూ పిలుచుకుంటారు. నాగార్జున తన కెరీర్లో ఎక్కువ ఫ్యామిలీ మరియు ప్రేమ కథ సినిమాలో ఎక్కువ చేశాడు. ఇక దీంతో నాగార్జునకు లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. తాజాగా నాగార్జున ది కోస్ట్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతోపాటు బాలీవుడ్‌లో రణబీర్ కపూర్ తో కలిసి బ్రహ్మాస్త్ర అనే సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

Nagarjuna Net Worth 2022: Salary Assets Income Biography

తాజాగా నాగార్జున గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నాగార్జునను కొన్ని విషయాలలో ఢీకొట్టే మగాడే టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడని ఒక వార్త బయటకు వచ్చింది. అయితే నాగార్జున ఏ హీరోకి లేని అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. నాగార్జున కెరీర్లో మరుపురాని సినిమాల్లో మనం సినిమా ఒకటి. ఈ సినిమాలో నాగార్జున- నాగేశ్వరరావు- నాగచైతన్య -అఖిల్ – సమంత మొత్తం ఫ్యామిలీతో కలిసినటించాడు.

Manam Movie

ఇలా కుటుంబం అంతా ఒకే సినిమాలో కలిసి నటించిన అరుదైన రికార్డ్ నాగ్‌ మాత్రమే దక్కింది. అదే క్రమంలో నాగార్జున అటు తండ్రి నాగేశ్వ‌రావుకు జోడిగా నటించిన హీరోయిన్లతో కూడా నటించాడు. కొడుకు నాగచైతన్యతో నటించిన హీరోయిన్లు కొందరితో కలిసి నటించాడు. ఈ క్రమంగా నాగార్జున అరుదైనరికార్డును సొంతం చేసుకున్నాడు.

Share post:

Latest