సముద్రం నడిబొడ్డులో తన పాట్నర్ తో ముద్దులతో రెచ్చిపోయిన హీరోయిన్?

ఈమధ్య రొమాన్స్ హద్దులు దాటుతోంది. ముఖ్యంగా నేటి యువత ఎక్కడ పడితే అక్కడ రెచ్చిపోతున్నారు. ఇక అలాంటివారిని ఎంకరేజ్ చేసే దిశగా నేటి తారలు కూడా హద్దులు మీరుతున్నారనే చెప్పుకోవాలి. తాజాగా ‘నాగిని’ సీరియ‌ల్ ఫేం, బుల్లితెర న‌టి మౌనీరాయ్ తన ప్రియుడు సూర‌జ్ నంబియార్‌ను తాజాగా పెళ్లాడింది. జ‌న‌వ‌రి 27న‌ ఉద‌యం మ‌ల‌యాళీ సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో వీరి వివాహం జ‌రిగింది. ఈ వేడుక‌కు ఇరు కుటుంబాల‌తో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు సైతం హాజ‌రై వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. వీరి పెళ్లి ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో ప్రస్తుతం హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

2004లోనే సినిమాల్లోకి వ‌చ్చిన మౌని నాగిని సీరియల్ తో బాగా పాపులర్ అయ్యింది. ఆ తరువాత అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. టీవీషోలు, సీరియ‌ల్స్ లో సంద‌డి చేసింది. సినిమాల్లో కూడా అడపాదడపా స‌త్తా చాటుతున్న‌ది. తుమ్ బిన్‌2, గోల్డ్ చిత్రాలతో పాటు KGFలో ఐటం సాంగ్‌లో న‌టించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది మౌనీరాయ్‌. అలాగే బ్ర‌హ్మ‌స్త్ర‌, మొగుల్ సినిమాల్లో కూడా అమ్మడు న‌టిస్తోంది. బాలీవుడ్‌లో రోమియో, అక్బర్ వాల్టర్, మేడ్ ఇన్ ఇండియా చిత్రాల్లో నటించారు.

భర్త సూరజ్ బర్త్ డే సందర్భంగా మౌనీరాయ్ వెకేషన్‌లో రొమాంటిక్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. న‌డి సంద్రంలో ముద్దు ముచ్చ‌టలాడుతూ తెగ రెచ్చిపోయారు. ఇకపోతే మౌనీరాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. దాంతో ఈమె ఈ వెకేషన్ కి సంబంధించినటువంటి పిక్స్ షేర్ చేసారు. “హ్యాపీ బర్త్ డే సూరజ్, నా జీవితానికి నీవే షైనింగ్ స్టార్.” అంటూ వారు ముద్దులాడుకున్న పిక్స్ షేర్ చేసారు.

Share post:

Latest