బిగ్ ఫెస్టివల్స్ పై కన్నేసిన మెగాస్టార్… ఈసారి గురి తప్పదు గురూ!

బహుశా తెలుగునాట మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని మనిషి వుండరు అంటే అతిశయోక్తిగా ఉంటుంది. నేడు ఆ మెగా వృక్షఛాయలో అనేకమంది హీరోలు టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ‘పునాదిరాళ్ళు’ అనే సినిమాతో కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనే వ్యక్తి చిరంజీవిగా ఎదిగిన తీరు వర్ణనాతీతం. ఇక అతని సినిమా వస్తుందంటే సినిమా థియేటర్ల దగ్గర ఎలాంటి సందడి నెలకొంటుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. మాస్ జనాలు అతని సినిమా అంటే పడి చస్తారు. క్లాస్ జనాలు అతని కామెడీ టైమింగ్, డాన్సులకు ఫిదా అయిపోతారు.

ఇకపోతే అలాంటి మాస్ ఫాలోయింగ్ వున్న నటుడి సినిమా సంక్రాంతి, దసరా వంటి సీజన్ లో వస్తే ఇంకేమైనా వుంటుందా. కుమ్ముడే కుమ్ముడు అన్నమాదిరి కలెక్షన్లు వచ్చేస్తాయి. సినిమా ఏ మాత్రం బాగున్నా ఇలాంటి సీజన్ లో గట్టి కలెక్షన్స్ రాబట్టుకోవచ్చు. అందుకే స్టార్ హీరోలందరూ ఈ సీజన్స్ పై ముందు నుండే ఓ కన్ను వేసి ఉంచుతారు. బేసిక్ గా చిరు లాంటి స్టార్ హీరోకి సీజన్స్ తో పని ఉండదు. ఎందుకంటే వీరి సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడే ఓ పండగ వాతావరణం నెలకొంటుంది మరి.

అయితే ఈసారి ఈ మూడు సీజన్స్ లో తన మూడు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు చిరు. రెండు బిగ్ ఫెస్టివల్స్ , సమ్మర్ లో అయితే తన సినిమాలకు ఓపెనింగ్స్ డోకా ఉండదని భావించి ఉండొచ్చు. అలాగే సినిమా యావరేజ్ టాక్ అందుకున్నా డీసెంట్ కలెక్షన్స్ పక్కా.. కాబట్టే ఈ డేట్స్ ఫిక్స్ చేసుకొని ఉండొచ్చు. మెగా స్టార్ అక్టోబర్ 5న దసరా సందర్భంగా ‘గాడ్ ఫాదర్’ తో , సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య'(వర్కింగ్ టైటిల్) గా , సమ్మర్ లో ఏప్రిల్ 14న ‘భోళా శంకర్’ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Share post:

Latest