100 మోస్ట్‌ బ్యూటిఫుల్‌ ఫేసెస్‌లో ‘మంచు లక్ష్మి’కి చోటు… ఒప్పుకోమంటున్న నెటిజన్స్?

మంచు లక్ష్మి.. ఆపేరు చూసినా, ఆపేరు చదివినా జనాలకి ఒకటే గుర్తుకు వస్తుంది. అదే లక్ష్మి టాక్ షో. అవును… కొన్ని సంవత్సరాలక్రితం బుల్లితెరపైన అలరించిన ఈ షో గురించి ఆహుతులు అంత త్వరగా మర్చిపోలేరు. ఈ షో ద్వారా పలువురు టాలీవుడ్ సెలిబ్రిటీల వింతలూ, విశేషాలను బయటపెట్టిన మంచు లక్ష్మి మంచి గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా ఆ షోలో ఆమె మాట్లాడిన తెలుగు అమెరికన్ యాక్సెంట్ కి అందరు పడిపోయారు… నిజం చెప్పాలంటే ఆమె సినిమాలలో నటించినప్పటికీ నటిగా కాకుండా తన మాటలవలనే ఎక్కువ గుర్తింపు సాధించిందని చెప్పుకోవాలి.

మంచువారి ఫామిలీ నుండి మహిళా నటిగా తెరంగేట్రం చేసిన లక్ష్మి నటిగా కూడా మంచి పేరే సంపాదించుకుంది. అమెరికాలో ఉన్న సమయంలో కొన్ని హాలీవుడ్‌ సిరీస్‌లో నటించ మంచు లక్ష్మి తర్వాత ఇండియాకు తిరిగొచ్చారు. అనంతరం ‘అనగనగా ధీరుడు’ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె అద్భుత నటనగాను కూడా నంది అవార్డును సైతం అందుకున్నారు. అంతేకాకుండా సింగర్‌గా మారి బెస్ట్‌ సెలబ్రిటీ సింగర్‌గా గామా అవార్డును సైతం అందుకుంది. ఇక సినిమాలతో బిజీగా ఉండే లక్ష్మీ.. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. యూట్యూబ్‌లో సొంతంగా చానల్స్‌ నిర్వహిస్తూనే మరో వైపు సోషల్‌ మీడియాలో ఫిట్‌నెస్‌, సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది.

ఇలా నిత్యం ఏదో అంశంతో వార్తలో నిలిచే మంచు లక్ష్మి తాజాగా మరోసారి వార్తల్లోకెక్కారు. అతికొద్ది మందికి మాత్రమే లభించే అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. టీసీ కండ్లెర్‌ అనే మ్యాగజైన్‌ ప్రతీ ఏటా 100 మోస్ట్‌ బ్యూటిఫుల్‌ ఫేసెస్‌ గ్లోబల్‌ జాబితాను విడుదల చేస్తుంది. తాజాగా లక్ష్మి మంచు ఇందుకు నామినేట్‌ అయ్యారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపారు. తనను నామినేట్‌ చేసిందుకు ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్‌ చేశారు. ఇక టీసీ కండ్లెర్‌ విషయానికొస్తే.. ఈ సంస్థ 1990 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉండే సినిమా, టీవీ, పాప్‌ ఆర్టిస్ట్‌లకు ఈ జాబితాలో చోటు కల్పిస్తుంటారు.

Share post:

Latest