కరోనా బారిన పడ్డ మలయాళ అందం.. అనుపమ..!

గత రెండు సంవత్సరాలకు పైగా కరోనా మహమ్మారి  కోరలు చాచి ఎంతో మందిని ప్రాణబలి తీసుకున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే కొన్ని కోట్ల మంది ప్రజలు కరోనా బారిన పడి మరణించారు. ఇక ఒకానొక సమయంలో శవాలు దిబ్బలుగా పేరుకుపోయిన సందర్భంలో శవాన్ని పూడ్చడానికి కూడా స్థలం కూడా లేకపోయినా సందర్భాలను మనం చూసే ఉన్నాం. ఇక అలాంటి దుర్భర పరిస్థితులు ఎప్పుడూ చూడకూడదు స్వామి అని వేడుకున్న ప్రజలు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇక మరి ముఖ్యంగా సినీ సెలబ్రిటీని కరోనా మహమ్మారి కుదేలు చేసిందని చెప్పవచ్చు. సెలబ్రిటీలు కరోనా బారినపడి కొంతమంది మరణిస్తే మరి కొంతమంది దేవుడి దయతో ఆరోగ్యంగా ఉన్నారనే చెప్పాలి.Anupama Parameswaran mourns the loss of her pet dogs: The pain is  unbearable - Movies News
అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గిందని ఇప్పుడు మళ్లీ షూటింగులు మొదలైన సందర్భంలో ఇటీవల సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు.మొన్నటికి మొన్న రష్మిక మందన్న కరోనా పాడిన పడి ఏకంగా బ్లాక్ బస్టర్ సినిమాలో అవకాశాన్ని కోల్పోయింది. ఆ తర్వాత బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు తాజాగా అనుపమ పరమేశ్వరన్ కూడా కరోనా భారిన పడినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కార్తికేయ 2 సినిమా ప్రమోషన్స్ లో ఎన్నో ప్రాంతాలలో పర్యటించిన అనుపమకు కరోనా సోకింది. జలుబు , జ్వరం వంటి లక్షణాలు ఉండడంతో వైద్య పరీక్షలు చేయించుకున్న అనుపమకు కరోనా పాజిటివ్ వచ్చిందని నిర్ధారణ అయింది. ఇక కరోనా సోకడంతో అనుపమ ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.5GloriousYRSOfAnupamaInTFI: Fans celebrate as Anupama Parameswaran  completes 5 years in Tollywood | Telugu Movie News - Times of India
ఇకపోతే నిఖిల్ , అనుపమ కాంబినేషన్లో వచ్చిన కార్తికేయ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో 18 పేజీస్ సినిమా కూడా ఏప్రిల్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇకపోతే ఈమె  త్వరగా కోలుకోవాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.

Share post:

Latest