ఒకటే ఫార్ములాతో ఎన్నాళ్ళు సినిమాలు తీశారో తెలుసా? ‘అక్కతో పెళ్లి, కానీ చెల్లిని ప్రేమించి పెళ్లాడతారు’!

ఇప్పుడంటే మన తెలుగు సినిమాల పరిస్థితి కొంచెం మారింది కానీ, ఒకప్పుడు రొడ్డకొట్టుడు సినిమాలు వస్తుండేవి. విచిత్రంగా అదే సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యేవి. అయితే అప్పటి ప్రేక్షకులు కూడా వేరు లెండి. ఇప్పుడున్నంత పరిజ్ఞానం అప్పుడు లేదు. కాబట్టి ఒకే మూస ధోరణిలో సాగిపోతున్నా పెద్ద పట్టించుకునే వారు కాదు. అదే వైఖరి ఇప్పుడు అవలంబిస్తే మాత్రం సోషల్ మీడియాలో ప్రేక్షకులు తాట తీసేస్తారు. అయితే అప్పుడు దాదాపు ఒకే ఫార్ములాతో చాలా సంవత్సరాలు సినిమాలు తీసేవారు. ఆ విషయం ఏ కొద్దిమందో గాని అందరూ కనిపెట్టలేకపోయేవారు.

ముఖ్యంగా అప్పుడు సినిమా మొదట్లోనే “అక్కతో పెళ్లి సెట్ అవుతుంది, కానీ కడకు చెల్లిని ప్రేమించి పెళ్లాడతాడు హీరో!” ఇదే లైన్ తో అనేక సినిమాలు వచ్చి జూబ్లీ, సిల్వర్ జూబ్లీలు ఆడేవి. ఆ సినిమాలలో ముఖ్యంగా తీసుకుంటే.. మొదటగా ‘ఏవండోయ్ శ్రీవారు’ సినిమాని చెప్పుకోవచ్చు. సత్తిబాబు దర్శకత్వంలో 2006 లో విడుదలైన ఈ సినిమాలో మొదట శ్రీకాంత్ నికితను ప్రేమించగా ఆ తర్వాత స్నేహాను పెళ్లి చేసుకుంటాడు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఆ తరువాత ‘సంతోషం’ సినిమాని చెప్పుకోవచ్చు. 2002లో కొండపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగార్జున, శ్రియ శరన్, గ్రేసీ సింగ్ నటించారు. అప్పట్లో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.

తరువాత ‘పౌర్ణమి’ సినిమాని పేర్కొనవచ్చు. ప్రభుదేవా దర్శకత్వంలో 2006లో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్, త్రిష, చార్మి ప్రధాన పాత్రలు పోషించగా ఇందులో ప్రభాస్ మొదట త్రిషను పెళ్లి చేసుకున్నాడు. ఈ సినిమా కూడా బాగా సక్సెస్ అయ్యింది. ఇక దానితరువాత ‘అత్తారింటికి దారేది’ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2013లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సమంత, ప్రణీత కీలక పాత్రలో నటించారు. ఇందులో పవన్ కళ్యాణ్ ముందుగా ప్రణీతను ఇష్టపడగా ఆ తర్వాత తన చెల్లి అయినటువంటి సమంతను ప్రేమించి పెళ్లాడతాడు. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి చెప్పనవసరం లేదు. ఇలాగే ఈ లైన్ తో మీకు ఏ సినిమా అన్న తడితే కింద కామెంట్ చేయండి.

Share post:

Latest