డిజాస్ట‌ర్ టాక్‌తో దుమ్ము రేపిన ‘ లైగ‌ర్ ‘ ఫ‌స్ట్ డే వ‌సూళ్లు..!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా తెర‌కెక్కిన సినిమా లైగ‌ర్‌. పూరి జ‌గ‌న్నాథ్ నుంచి ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత వ‌చ్చిన ఈ లైగ‌ర్‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 90 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. సినిమాకు అడ్వాన్స్ బుకింగ్‌లు అదిరిపోయాయి. దీంతో సినిమాకు నెగ‌టివ్ టాక్ వ‌చ్చినా కూడా ఫ‌స్ట్ డే ఓపెనింగ్స్ దుమ్ము రేపేశాయి.

లైగ‌ర్‌ నైజాం లో ఫస్ట్ డే మంచి వసూళ్లనే సాధించింది. అక్కడ ఈ సినిమా రు. 4.25 కోట్లు షేర్ నమోదు చేసింది. ఓవరాల్ గా కూడా ఈ చిత్రం విజయ్ కెరీర్ లో బెస్ట్ వసూళ్లనే అందుకున్నట్టు ట్రేడ్ రిపోర్టులు చెపుతున్నాయి. మిగిలిన ఏరియాల వ‌సూళ్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు ఛార్మి మరియు కరణ్ జోహార్ లు నిర్మాణం వహించారు.

Share post:

Latest