హ‌వ్వా.. తెలుగు సినిమా సిగ్గుపడేలా లైగ‌ర్ చెత్త రికార్డ్‌..!

లైగర్.. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన చిత్రం లైగర్.. ఈ సినిమా ఏ స్థాయిలో డిజాస్టర్ మూటగట్టుకుందో మనం వింటూనే ఉన్నాం.. అంతేకాదు తెలుగు సినీ పరిశ్రమ సిగ్గుపడే అంతగా చెత్త రికార్డును సొంతం చేసుకుంది ఈ సినిమా.. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ప్రముఖ హీరోయిన్ ఛార్మి కౌర్ తన 20 సంవత్సరాలు సినీ ప్రయాణంలో దాచుకున్న 200 కోట్ల రూపాయలను కూడా ఈ సినిమాతో నష్టపోయింది. దీంతో ఇక ఈమెకు కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పవచ్చు.Liger New Poster: Vijay Deverakonda Is Burning Up The Internet

మామూలుగా ప్రతి సైటు ప్రతి సినిమాకు ఏదో ఒక ర్యాంకు ఇచ్చి ఏదో ఒక రివ్యూ వదులుతూ ఉంటుంది. అది కూడా ఈమధ్య దందా లాగా అయిపోయింది. ఇక ఆ ర్యాంకులకు పెద్దగా విశ్వసనీయత లేదని చెప్పాలి. కాకపోతే నేటిజెన్లు నమ్మకపోయినా చూస్తుంటారు. ఈ ర్యాంకుల్లో కోట్ల మంది నేటిజన్లు కాస్త నమ్మేది ఐఎండిబి ర్యాంకుల్ని మాత్రమే.. ఇదే కాకుండా రాటెన్ టొమాటోస్ వంటివి కూడా ర్యాంక్ లు ఇస్తుంటాయి. కానీ ఐ ఎం డి బి ర్యాంకులకు కాస్త విలువ ఉంది అని చెప్పవచ్చు.. ఐఎండిబి లక్షల మంది పాఠకులు ఇచ్చే రేటింగ్స్ ను క్రోడీకరించి ఏదో ఒక అంకె ఖరారు చేస్తుంది. ఇక ఇదే లోపల రహితం కాదు .. దీని పాఠకులు అధికంగా మగవాళ్ళు.. పైగా ఈ వెబ్సైట్ ర్యాంకులను ట్వీక్ చేస్తూ ఉంటుంది కూడా..

ఐఎండిబి ఎలా ఇచ్చినా సరే దాన్ని ర్యాంకు బాగా ఉంటేనే సినిమాకు మంచి పేరు వస్తుంది. లేకపోతే నలుగురిలో సిగ్గుబాటుతనమే అవుతుందని చెప్పవచ్చు. మరి అసలు అత్యంత తక్కువ ఐఎండిబి రేటింగ్ కలిగి ఉన్న సినిమాలు ఏమిటో అని ఒకసారి సెర్చ్ చేస్తే లైగర్ సినిమా కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఐఎండిబి జాబితా ప్రకారం 1.7 ర్యాంకు సాధించి ఇంత చెత్త రికార్డును ఏ సినిమా సృష్టించలేదు అంటూ చూపించింది ఐఎండిబి. 2022 సంవత్సరానికి గాను టాలీవుడ్ సినీ పరిశ్రమలోనే అత్యంత చెత్త రికార్డును సొంతం చేసుకున్న సినిమాగా లైగర్ సినిమా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ అంశం విజయ్ దేవరకొండ అభిమానులకు నొప్పి కలిగించే అంశమే అయినా..డబ్బు పోగొట్టుకొని చార్మి ఎంత బాధ పడుతుందో అర్థం చేసుకోవచ్చు.Liger Rating: 'Liger' worst record on IMDb

Share post:

Latest