అనుపమ పరమేశ్వరన్ రాజమౌళి కాళ్ళు మొక్కింది.. గాలం వేస్తోందా?

అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు యువతకు చెప్పాల్సిన పనిలేదు. చేసిన సినిమాలు అడపాదడపా చేసినా ఆమె కుర్రకారు మదిలో గుర్తుండిపోయేలా అభినయిస్తుంది. ఇకపోతే తాజాగా యంగ్ హీరో నిఖిల్ సరసన ఈమె నటించిన కార్తికేయ 2 నిన్ననే థియేటర్లలో పాజిటివ్ టాక్ తో సందడి చేస్తోంది. యువత మెచ్చే విభిన్నమైన కథలతో నిఖిల్ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. తొలి షో నుంచే ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా రోజులుగా థియేటర్స్ సమస్య, కోవిడ్ కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. దీనితో పలు సందర్భాల్లో నిఖిల్ ఎంతో బాధపడ్డాడు.

అయితే ఎట్టకేలకు రిలీజైన కార్తికేయ 2 దుమ్ముదులుపుతోంది. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ దక్కడంతో నిఖిల్ కష్టానికి ఫలితం దక్కింది అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి, కీరవాణి, ఇతర కుటుంబ సభ్యలు తొలి షోని ప్రసాద్స్ లో వీక్షించారు. కీరవాణి తనయుడు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడంతో వీరు కుటుంబసమేతంగా సినిమా హాలుకి వెళ్లారు. అక్కడే అనుపమ కూడా అభిమానులతో కలసి తన చిత్రాన్ని చూసింది.

అనంతరం అనుపమ పరమేశ్వరన్ రాజమౌళి వద్దకు వెళ్లి ఆయన కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే నెటిజన్లు ఆమెపైన రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక రాజమౌళి కూడా సినిమాని ప్రశంసించడంతో అనుపమ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. శ్రీకృష్ణుడి బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు చందు ముండేటి అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక కాలభైరవ అందించిన బిజియం టెర్రిఫిక్ గా ఉందని ప్రశంసిస్తున్నారు. ఇటీవల అనుపమకి సరైన హిట్ లేదు. కార్తికేయ 2తో అనుపమకి మంచి హిట్ పడిందనే చెప్పుకోవాలి.

Share post:

Latest