జియాఖాన్ ను శారీరకంగా హింసించిన నటుడు?

2013లో సంభవించిన బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జియాఖాన్ ఆత్మహత్య అప్పట్లో పెను సంచలమే సృష్టించింది. బాలీవుడ్ నటుడు సూరజ్ పంచోలీతో జియా రిలేషన్ షిప్ వికటించి అది ఆత్మహత్యకు ప్రేరేపించిందని అప్పట్లో కధలు కధలుగా వినిపించాయి. జియా ఖాన్ ను శారీరకంగా వేధించాడని.. మాటలతో హింసించేవాడని ఆమె తల్లి రబియా తాజాగా ఈ బుధవారం నాడు ప్రత్యేక కోర్టుకు తెలిపారు. CBI విచారిస్తున్న ఈ కేసులో 25 ఏళ్ల జియాఖాన్ తో సంబంధం కలిగి ఉన్న పంచోలిపై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం అతడు బెయిల్ పై బయట తిరుగుతుండటం కొసమెరుపు.

బుధవారం జియాఖాన్ తల్లి రబియాఖాన్ ప్రత్యేక న్యాయమూర్తి AS సయ్యద్ ముందు ఈ కేసులో తన వాంగ్మూలాన్ని నమోదు చేసారు. జియా బాలీవుడ్ లోకి ప్రవేశించాక కెరీర్ పురోగతి కోసం ప్రయత్నించింది. పంచోలి సోషల్ మీడియా సైట్ ద్వారా జియా ఖాన్ ను సంప్రదించారని.. తనను కలవాలని పట్టుబట్టారని ఆమె చెప్పారు. జియా ఖాన్ మొదట్లో ”భయపడేది.. అయిష్టంగా ఉండేది” అయితే 2012 సెప్టెంబర్ లో ఇద్దరూ మొదటిసారి కలుసుకున్నారని రబియా ఖాన్ చెప్పారు. ”ఆ సమయంలో జియా అతడికి కొన్ని ఫోటోలను పంపింది” వారు ఫోటోషూట్ చేశారని పరస్పరం ఆసక్తిగా ఉన్నట్టుగా నాకు అనిపించింది.

అయితే సెప్టెంబర్ లో వారు కేవలం స్నేహితులు మాత్రమే అని నాకు చెప్పారు అని చెప్పింది. తన కూతురి దినచర్యను పంచోలీ తన చేతిలోకి తీసుకున్నారని అక్టోబర్ 2012 నాటికి ఇద్దరూ ఒకే ఇంట్లో నివసించడం ప్రారంభించారని రబియా ఖాన్ చెప్పారు. ఆ సంవత్సరం నవంబర్ లో ఆమె లండన్ లోని తమ ఇంటికి వచ్చినప్పుడు జియా చాలా సంతోషంగా కనిపించిందని ఆమె చెప్పారు. జియా ఖాన్ వృత్తిపరమైన పని కోసం ముంబైకి తిరిగి వెళ్లింది. క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి తిరిగి రావాల్సి ఉంది.. కానీ తిరిగి రాలేదని రబియా ఖాన్ చెప్పారు.

Share post:

Latest